హైదరాబాద్ :ఆగస్టు 25
మంథని నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకుగాను పుట్ట మధు దంపతులు సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను జడ్పీచైర్మన్, అభ్యర్థి పుట్టమధు, మున్సిపల్ చైర్‌పర్సన్ పుట్ట శైలజ కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. బీఆర్ఎస్ టికెట్ తో వెళ్తున్న పుట్ట మధు మంథని నియోజక వర్గంపై గులాబీ జెండా ఎగురవేయాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ప్రజల మెప్పుతో విజయఢంకా మోగించాలని ఆదేశించారు.మంథని బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు క్రమశిక్షణతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పుట్ట మధు మాట్లాడుతూ తనపై నమ్మకం, విశ్వాసంతో టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా విజయం సాధించి తిరిగి వస్తానని సీఎంకు హామీ ఇచ్చారు...
Read More:
Read More :
G20 Summit: జీ20 కోసం భారత ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తుందో తెలుసా?
AP లో భారీగా బదిలీలు ఏపీ లో 35 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు
0 Comments