సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడుదాం అని
సిపిఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ సిపిఎం సీనియర్ నాయకులు బొట్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.-
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నివసిస్తూ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుండి 7 వరకు సిపిఎం నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.-------
ఇందులో భాగంగా గురువారం స్థానిక నెహ్రూ పార్క్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు బొట్ల శ్రీనివాసా అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సిపిఎం జనగాం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ పాల్గొని మాట్లాడారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర సరుకుల ధరలు వెంటనే తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను మొదలు పెట్టాలన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరను తగ్గించాలి రేషన్ షాప్ ద్వారా 18 రకాల వస్తువులను ఇవ్వాలి. డబల్ బెడ్ రూంలో కొత్త అన్ని రకాల పెన్షన్లు జనగామలో నిరుద్యోగులకు ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలి ఉపాధి కల్పించాలి గృహలక్ష్మి ద్వారా అప్లై చేసుకున్న అందరికీ 10 లక్షలు ఇవ్వాలని అన్నారు. మహిళలపై రోజురోజుకు దాడులు, అత్యాచారాలు పెరిగిపోయి వారి బతుకులు చిధ్రo అయ్యాయని అన్నారు. దేశంలో కులమత ఘర్షణలు పెరిగిపోతున్నాయి అన్నారు. వీటికి కారణమైన బిజెపి హిందుత్వం పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
దేశంలో కోట్ల మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు అన్నారు.
. వీరిపై పన్నుల భారం పెంచి మరింత దరిద్యంలోకి నేడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
నిత్యవసర సరుకులు పెరగడానికి ప్రభుత్వాలే కారణం అన్నారు.
నిత్యవసర సరుకులపై 12- 18 శాతం పన్నులు వేయడంతో అనివర్యంగా ధరలు పెరుగుతున్నాయి అన్నారు.
నిత్యవసర సరుకులు ధరలను అరికట్టాలని డిమాండ్ చేశారు.
మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టపరిచి, బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి. అజారుద్దీన్ బెల్లంకొండ వెంకటేష్ అతని కమిటీ సభ్యులు కళ్యాణం లింగం. పందిళ్ళ పందిళ్ళ బోట్ల శ్రావణ్ బాల్నే వెంకట మల్లయ్య సందీప్ DYFI నాయకులు భాషపాక విష్ణు, కచ్చగల వెంకటేష్ భూమాద్రి వెంకటేష్ దామెర అబ్రహం లింకన్ తేజావత్ గణేష్ సిల్వర్ ఉపేందర్ ఎర్ర రజిత ఎండి నాజియా మున్సిపట్ల జయ కందుకూరి కస్తూరి అంజమ్మ భాగ్య పద్మ రమ మమత టాచూరి గణేష్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
Read More :
AP లో భారీగా బదిలీలు ఏపీ లో 35 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు
0 Comments