చిలకలూరిపేట;మండలంలోని కావురు గ్రామంలోని ఏకలవ్య కాలనీ (ఎస్టీ )కి గత మూడు నెలల నుంచి విద్యుత్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి.శ్రీను నాయక్ అన్నారు. ఆదివారం కాలనీ వాసులతో కలిసి నాయక్ మాట్లాడుతూ పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులకు సమస్యను తెలియజేసిన పట్టించుకోలేదని ఆగ్రహ వ్యక్తం చేశారు. కాలనీ చుట్టూతా వ్యవసాయ భూములు ఉన్నాయని వాటిలో నుంచి విషపూరితమైన పాములు, ఇతర క్రిమి కీటకాలు వస్తున్నాయని వాటి వలన రాత్రులు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. జరగరానిది ఎమైనాజరిగితే అధికారులే నైతిక బాధ్యత వహించవలసి వస్తుందన్నారు. రెండు రోజుల వ్యవధిలో ఏకలవ్య కాలనీకి ఉన్న విద్య సమస్యను పరిష్కరించకపోతే రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలు చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి కుంభా నాగేశ్వరరావు, ఉయ్యాల వెంకటేశ్వర్లు, కుంభ బాబు, మొగలి శివ లీలమ్మ, కుంభ నాగేంద్రం, మొగిలి కోటేశ్వరరావు, కుంభ అంజమ్మ, తో పాటు పలువురు పాల్గొన్నారు...!
Read More :
G20 Summit: జీ20 కోసం భారత ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తుందో తెలుసా?
AP లో భారీగా బదిలీలు ఏపీ లో 35 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు
0 Comments