కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం రాస్తారోకో
పాలకవర్గాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు ధరల పెరుగుదలపై సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న. మండల కార్యదర్శి మాచర్ల సారయ్య పాల్గొని మాట్లాడుతూ.కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేయడం లేదని విమర్శించారు. ప్రజలపై ధరల భారాన్ని మోపి కార్పొరేట్.శక్తులకు దోచిపెడుతుందని తీవ్రంగా మండిపడ్డారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే అనుకూల విధానాలు చేపట్టాలని కోరారు. నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని విద్య వైద్య సౌకర్యాలను ప్రజలకు ఉచితంగా అందించాలన్నారు. ఇండ్ల స్థలాలు లేని పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కొడ్.లను రద్దు చేయాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు సోమసత్యం, సీనియర్ నాయకులు సోమ అశోక్, బెల్లి సంపత్, మూస్కుఇంద్రారెడ్డి, సోమన్న, పనికిరరాజు, పనికర భాస్కర్, చెరుపెల్లి కొమురయ్య, సిఐటియు నాయకులు ఏనుగతల వెంకన్న, తోటరాజు, వేల్పుల కుమార్,వేల్పుల ఎల్లయ్య, సాంబాజి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
Read More :
AP లో భారీగా బదిలీలు ఏపీ లో 35 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు
0 Comments