*సర్వే పేరుతో కాలయాపన లబ్ధిదారులను మోసం చేస్తే సహించేది చేయలేదు
**************************
సీపీఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
జనగామ : గత 10 సంవత్సరాల కాలం నుండి మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల పట్టాలు ఇచ్చి స్థలం చూపించడం మరిచి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పినేటికి 5 సంవత్సరాలు పూర్తి అవుతున్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేయకపోవడం అసమర్థ పాలనకు నిదర్శనం అని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శిమోకు కనకారెడ్డి అన్నారు. శనివారం రోజున మూడో విడత ఇంద్రమ్మ లబ్ధిదారుల జనరల్ బాడీ సమావేశం చాకలి ఐలమ్మ నగర్ లో సిపిఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కనక రెడ్డి మాట్లాడుతూ మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చే విషయంలో పట్టణంలో సర్వే నిర్వహించి లబ్ధిదారులు ఎంపిక చేస్తామని చెప్పి వారితో పాటు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారిని కూడా సర్వే చేయడం హేయమైన చర్య అన్నారు. గతంలో అధికారుల పర్యవేక్షణలో గుర్తించిన 660 మందిని లబ్ధిదారులను గుర్తించి లిస్టు తయారుచేసి మళ్లీ సర్వే పేరుతో లబ్ధిదారులకు అన్యాయం చేసే విధంగా జనగామ జిల్లా కలెక్టర్ సర్వే పేరుతో కాలయాపన చేస్తూ మోసం చేయాలని చూస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. గతంలో గుర్తించిన 600 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిన తర్వాత మిగతా ఆరులైన ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ పేదల పక్షపాతిగా ఉండాలంటే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైన మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులకు పంపిణీ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని వారు జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్ మూడో విడత ఇంద్రమ్మ లబ్ధిదారుల పోరాట కమిటీ అధ్యక్షులు కళ్యాణ లింగం సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు బాల్న వెంకట మల్లయ్య రామావత్ మీట్యా నాయక్ ఎండి గౌసియా భాష పాక విష్ణు వెంకటేష్ ఉమా నాజియా వినోద్ మైబేళ్లి చందు శశిరేఖ అబ్రహం లింకన్ ఎర్ర అనిత శాంత జయ ఉమా భవాని కర్ణ పద్మ బలమని భాగ్య టాక్ ఆనంద్ కౌర్ రాజు మల్లేష్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments