OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

Geography of Telangana

 

తెలంగాణ జాగ్రఫీ (31 జిల్లాలతో )

1.     తెలంగాణ  రాష్ర్ట పరిచయం

v  తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరన చట్టం – 2014 (2014 నెం 6) ప్రకారం భారత దేశంలో 29 వ రాష్ట్రం గా అవతరించింది.

v  తెలంగాణ రాష్ట్రం మార్చి 1, 2014న, రాష్ట్రపత్తిచే సమ్మతించబడి 2-6-2014 నుంచి అమలులోకి వచ్చింది.

v  ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను, ఆంధ్రపరదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం 2014 (2014 నెం.19) గా జులై 17 2014 న సవరించబడింది. దీని ప్రకారం ఖమ్మం జిల్లాలోని 327 గ్రామాలను అవశేష ఆంద్రప్రదేశకు బదిలీ చేయడమయినది.

v  ఈ సవరణ మే 29, 2014 నుంచి అమలు చేయడం జరిగింది.

v  తెలంగాణ రాష్ట్రం భారతదేశం దక్షిణ ప్రాంతంలోని రాష్ట్రం.

v  ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ చట్టం, 2014 ) ప్రకారం రాష్ట్రం 1,12,077 చ. కి. మీ విస్తీర్ణం కలిగి వుంది. (యాక్ట్ నెం.6,2014 ప్రకారం 1,14,840 చ. కి. మీ.)

v  జనాభా పరంగా వైశాల్యం పరంగా రెండిటీలూనూ దేశంలో 12 వ పెద్ద రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.

v  తెలంగాణ రాష్ట్రం “15’050 ణ నుంచి 19.0 51 n ఉత్తర అక్షాంశాల మద్య మరియు “77.0 15’ e “ నుంచి 81.019 ఏ తూర్పు రేఖాంశాల మద్య విస్తరించి ఉంది.

v  హైదరాబాద్ రాష్ట్రం 1948లో భారతదీశ యూనియన్ లో చేరింది.

v  ఆ తరువాత 1956లో రాష్ట్రాలను భాషాపరమయిన పునర్వ్యవస్థీకరణ చేయగా హైదరాబాద్ లోని తెలుగు మాట్లాడే ప్రజలను తెలంగాణ రాష్ట్రాన్ని ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేయటం జరిగినది.

v  తెలంగాణ రాష్ట్రం భూపరివేష్టిత రాష్ట్రంగా ఉంది.

v  భారతదేశ వైశాల్యంలో తెలంగాణ రాష్ట్రానిది 12 వ స్థానం.

v  తెలంగాణ రాష్ట్రం దేశ విస్తీర్ణంలో 3.49 % ఉంది.

v  ఖమ్మం జిల్లాలోని 7 పోలవరం ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి బదిలీ చేశారు. అవి:

అవి : 1) కూనవరం 2) చింతనూరు 3) వేలేరుపాడు 4) వి. ఆర్. పురం 5) బుర్గమ పాడు 6)కుకునూరు 7)భద్రాచలంలో కొన్ని ముంపు గ్రామాలు.

v  తెలంగాణ రాష్ట్రం మొదటగా “ఆర్కియాన్ వ్యవస్థ” కి సంబంధించినది అనగా – భూ పాటలం (crust) చల్లారుతూ గట్టిపడుతున్న క్రమంలోవ్ ఏర్పడ్డ అతిపురాతన శిలా వ్యవస్థ. ఈ శిలలలో శిలాజాలు (FOSSILS) కనిపించవు. ఇవి అగ్ని, అవక్షేప శిలల యొక్క రూపాంతర శిలలు.

v  ఈ శిలాలలో ఐరన్, కాపర్, మాంగనీస్, లెడ్, గోల్డ్ లభిస్తాయి. ఈ రకమయిన శిలలు అదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, జిల్లాలో విస్తరించి ఉన్నాయి.  

v  తరువాత కాలంలో భారత ద్వీపకల్ప ప్రాంతంలోని భూపటలంలోని విదరాలు (FISSULES) గుండా లావా బహిర్గతం కావడం వలన సుమారు 10 లక్షల చదరపు కిలో మీటర్లు విస్తీర్ణంలో ఈ దక్కన్ లావా ప్రాంతం ఏర్పడింది. అయితే వివిధ సమయాల్లో లావా బహిర్గతం కావడం వల్ల ఒక పొర మీద మరొక పొర ప్రవహించి (ట్రాఫ్) లాగా ఏర్పడింది.--- ఈ రకమయిన “బాసాల్ట్ “ శిలలలో ఎక్కువగా కనిపించేది.

తెలంగాణలో ఈ రకమయిన శిలలు అదిలాబాద్ లో పూర్తిగా, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉత్తర ప్రాంతాలలో నల్గొండ, మహేబూబ్నగర్ జిల్లాలలో అక్కడక్కడా విస్తరించి ఉన్నాయి.

v  తెలంగాణ ఆర్కియాన్ మరియు గోండ్వానా వ్యవస్థకు చెందినటువంటి శిలలు 500-600 మీటర్ల ఎత్తులో కలవు. సాధారణంగా ఈ ప్రాంతాన్ని “తెలంగాణ పీఠభూమి” గా పిలుస్తారు.

aaఅయితే ఉత్తర భాగం కంటే, దక్షీణ భాగం అధిక ఏయటహూన ఉండటం వలన మహారాష్ట్ర లూనీ పశీమా కనుమలు (సహ్యాద్రి) లో పుట్టినటు వంటి గోదావరి మరియు కృష్ణ నదులు ఈ పీఠభూమి ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నాయి. 

తెలంగాణ లోవ పీఠభూములు :-

బైంసా – నిర్మల్ పీఠభూమి

భువనగిరి రామన్నపేట్ పీఠభూమి

దేవరకొండ పీఠభూమి

నల్గొండ మిర్యాలగూడ పీఠభూమి

సూర్యాపేట పీఠభూమి

మెదక్, హైదరాబాద్ జిల్లాలో వ్యాపించి ఉంది

తెలంగాణ రాష్ట్రం భౌగోళిక విస్తీర్ణంలో ఈ పీఠభూమి సుమారు 59,903 చ. కి. మీ. వ్యాపించి ఉంది. సగటున ఈ ప్రాంతం ఎత్తహు సముద్రమట్టానికి “500 నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉంది.  ఈ ప్రాంతం వ్యయాలు తూర్పు దిశకు వాలి ఉంటుంది. ఈ ప్రాంతం అంతా చిన్నగుట్టలు, కొండలు ఏత్తు పల్లాల స్థలకృతిని కలిగి ఉంటుంది. ఈ గుట్టలను వివిధ జిల్లాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.

1

అదిలాబాద్

సత్నాల కొండలు

2

నిర్మల్

నిర్మల్ కొండలు

3

కొమురం భీమ్ ఆసిఫాబాద్

సరపూరు కొండలు

4

జగిత్యాల

రాఖీ కొండలు

5

పెద్దపల్లి

రామగిరి కొండలు

6

వరంగల్ అర్బన్

కంధికాల్ కొండలు

7

జయశంకర్ భూపాలపల్లి

పాండవుల గుట్టలు

8

ఖమ్మం కొత్తగూడెం

పాపి కొండలు, రాజు గుట్టలు, హాసంపార్ధి కొండలు, చంద్రగిరి కొండలు, ఐరాన్ కొండలు, యల్లంపాడ్ గుట్టలు,

9

నల్గొండ, యాదాద్రి భువనగిరి

నంది కొండలు, భువనగిరి కొండలు, యాదాద్రి కొండలు, నీలగిరి కొండలు, నాగార్జున కొండలు.

10

నాగర్ కర్నూల్

నల్లమల కొండలు, అమ్రాబాద్ కొండలు

11

మహబూబ్ నగర్

షాబాద్ కొండలు

12

రంగారెడ్డి వికారాబాద్

అనంత గిరి కొండలు

13

రంగారెడ్డి హైదరాబాద్

గోల్కొండ, రాచకొండ

14

మెదక్, సిద్దిపేట

లక్ష్మీదేవుని పల్లి కొండలు, బూజు గుట్టలు

15

కామారెడ్డి, నిజామాబాద్

సిరణపల్లి కొండలు, రతి కొండలు

 

జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం తెలంగాణలోని శిలాలను 4 రకాలుగా విభజించారు.

1.     అరఖియన్ శిలలు

2.    వింద్య శిలలు

3.    గోండ్వానా శిలలు

4.    ద్రవిడియన్ శిలలు

టెలయంగాన సముద్ర మట్టానికి 600 మీటర్ల ఏయత్తులోగాల ప్రాంతాలు : హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మబూబ్ నగర్, జిల్లాలు ఈ ప్రాంతాలలో కలవు. ఈ ప్రాంతాల యొక్క వ్యయాలు తూర్పు దిశకు వాలి ఉండటం వలన, ఈ ప్రాంతంలోని కృష్ణ, గోధవారి నదులు మరియు వాటి ఉపనాధులు తూర్పు వయిపు ప్రయాణిస్తాయి.

తెలంగాణ సముద్ర మట్టానికి 300 నుండి 500 మీటర్ల ఎత్తులో గల ప్రాంతాలు.

రంగారెడ్డి, నిజామాబాద్,వరంగల్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్, జిల్లాలు ఈ ప్రాంతాల లో కలవు. ఈ ప్రాంతం అంతటా నీటి వనరులతో సమృద్ధిగా వుంది వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది.


a

 

 

Post a Comment

0 Comments