OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

ఎన్నికల కౌంటింగ్ ఎజెంట్స్ ప్రక్రియ Process of Election Counting Agents

కౌంటింగ్ కేంద్రానికి 4-6-2024 ఉదయం 6 గంటలకు హాజరు కావాలి.... కౌంటింగ్ సిబ్బంది వారికి...

Common problems encountered by election counting agents process

form-18 declaration.

Duty order.

ID బడ్జెట్.

Aadhar.

Any photo ID.

One Notebook & pen.

Form-17 C

(Process of Election Counting Agents)

ఒక్కొక్క టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్ఒ క కౌంటింగ్ అసిస్టెంట్ మైక్రో అబ్జర్వర్ ఉంటారు

అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు14 టేబుల్స్ కు 14 కౌంటింగ్ ఏజెంట్స్ నియమించుకోవాలి..

సెల్ ఫోన్లు...

వాచ్ లు...

కళ్ళ జోళ్ళు...

స్పై కెమెరాలు...

గోల్డ్ వస్తువులు...

సిగరెట్, మద్యపానం, తినుబండారాలు, వాటర్ బాటిల్, బ్యాగ్స్, పర్స్ లు, మెడికల్ మందులు కౌంటింగ్ సెంటర్ లోపలికి తీసుకోని వెళ్లరాదు ఎజెంట్స్ భోజనాలు పోటీ అభ్యర్థులు చూసుకోవాలి. వెళ్లిన తర్వాత బయటకి రావడానికి ఉండదు.మీకు కేటాయించిన టేబుల్ వద్దనే కూర్చోవాలి ఇంకెక్కడకు తిరగరాదు కౌంటింగ్ సిబ్బంద ఫెన్సింగ్ చేసిన లోపల... ఏజెంట్స్ ఫెన్సింగ్ బయట కూర్చుంటారు పార్లమెంటుకి అసెంబ్లీ కి వేరు వేరుగా 14 టేబుల్స్ ఉంటాయి...

(Process of Election Counting Agents)

CU గమనిస్తే

Common problems encountered by election counting agents process

M అని నోట్ చేసి ఉంటే మీకు వచ్చిన CU లో Mockpoll డిఫెక్ట్ ఉన్నట్లు 

D అని నోట్ చేసి ఉంటే మీరు 2 CU లలో Result చెక్ చేయాలన్నట్లు.

ముఖ్య గమనిక : పొరపాటున PO లు క్లోసింగ్ బటన్ నొక్కి ఉండకపోతే మీరు క్లోజ్ చేసిన తర్వాత ఫలితాలు చూసుకోవాలి.

 కౌంటింగ్ ప్రక్రియ (Process of Election Counting)

మొదట కౌంటింగ్ ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ తో ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ఆరంభించిన అరగంట తర్వాత ఈవీఎం కౌంటింగ్ మొదలవుతుంది. ముందుగా ఈవీఎం (Control Unit) మీ టేబుల్ వద్దకు వస్తుంది. ముందుగా కంట్రోల్ యూనిట్ బాక్స్ యొక్క అడ్రస్ ట్యాగ్ సీల్ వెరిఫై చేయవలెను. కంట్రోల్ యూనిట్ ఓపెన్ చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్ కి అడ్రస్ ట్యాగ్లు మరియు గ్రీన్ పేపర్ సీలు సరిగా ఉందా చెక్ చేసుకోవలెను. గ్రీన్ పేపర్ సీల్ సరిగా ఉన్నట్లయితే దానిని కట్ చేసి రిజల్ట్ డోర్ ఓపెన్ చేస్తారు. రిజల్ట్ బటన్ ప్రెస్ చేసేముందు కేసులో ఉన్న form-17 C ని బయటకు తీసి, Polling Station Number, Control Unit number, Total Votes Polled చెక్ చేసుకోండి. ఇప్పుడు Result బట్టన్ ప్రెస్ చేస్తారు. ముందుగా పోలింగ్ తేదీ వివరాలు మరియు టోటల్ ఓట్స్ పోల్డ్ వివరాలు డిస్ప్లే అవుతాయి. Total Votes Polled - Form -17C తో సరిపోల్చుకోండి.

నిర్దారణ సరి కాకపోతే వెంటనే RO కి తెలియజేయండి. RO ఆ మిషన్ తీసుకెళ్లి పోతారు మీరు ఆ రౌండ్ ఖాళీగా ఉంటారు. నిర్దారణ సరిపోతే ఒక్కొక్క అభ్యర్థి యొక్క రిజల్ట్ అబ్జర్వ్ చేస్తూ నమోదు చేసుకుంటారు. కౌంటింగ్ సూపర్వైజర్  17 సీ లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది నోట్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఒక వేళ రిజల్ట్ మళ్లీ చూడాలనుకుంటే RO  పర్మిషన్ తీసుకొని మరల రిజల్ట్ బటన్ ప్రెస్ చేయవచ్చు. అంతా సవ్యంగా ఉంటే కౌంటింగ్ సూపర్వైజర్  form-17C  Part-2 లో రిజల్ట్ వివరాలు (Nota తో సహా )నమోదు చేసి ఏజెంట్లు చేత సంతకం చేయిస్తారు...

Form-17C మొత్తం 3 కాపీలు తయారు చేసుకొని ఒకటి RO గారికి... ఒకటి సిబ్బందికి... ఒకటి ఎజెంట్స్  దగ్గర ఉంచుకోవాలి...

Counting Supervisors ప్రతి CU కి Result చెక్ చేసిన అనంతరం ఈ క్రింది విధంగా సర్టిఫై చేయాలి....

Certificate: We, hereby certify that CU No:......

are the same which were used in the Polling Station No:........

"Counting Supervisor"

RO కి గారికి వివరాలు అందజేసిన తర్వాత అన్ని టేబుల్ యొక్క రిజల్ట్ బోర్డు మీద వ్రాస్తారు...

అలా మొదటి రౌండ్ పూర్తవుతుంది.

తరువాత రెండవ కంట్రోల్ యూనిట్ వస్తుంది అదే విధంగా అన్ని కంట్రోల్ యూనిట్లు లెక్కింపు పూర్తయ్యే వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.

అన్ని కంట్రోల్ యూనిట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత లాటరీ పద్ధతిలో 5 VVPAT మిషన్ ల నుండి ఓటర్ స్లిప్పుల్ని తీసి వాటిని కౌంట్ చేస్తారు.

మొత్తం ఓటర్ స్లిప్పులు, ఫారం 17 సి మరియు కంట్రోల్ యూనిట్ లో టోటల్ సరిపోయిందో లేదో నిర్దా5 చేస్తారు. నిర్దారణ నిజం అయితే Result Declare చేస్తారు. నిర్దారణ కానిచో ఓటర్ స్లిప్ ల సంఖ్యనే పరిగణలోకి తీసుకుంటారు.


సాధారణంగా వచ్చే సమస్యలు Common problems encountered by election counting agents process

సీలింగ్ సరిగా లేకపోవుట. గ్రీన్ పేపర్ సేల్ బ్రేక్ అయి ఉండుట.. కంట్రోల్ యూనిట్ ఆన్ అవకపోవుట.. on కాకపోతే RO  క్రొత్త battary పెడితే on అవుతుంది. అప్పటికి ఆన్ కాకపోతే కంట్రోల్ యూనిట్ని పక్కన పెడతారు. దానికి సంబంధించిన VVPAT స్లిప్పులను లెక్కిస్తారు. కంట్రోల్ యూనిట్ లో నంబరు ఫారం 17 సి కంటే ఎక్కువగా ఓట్లు ఉన్నట్లయితే VVPAT తెప్పించి మాక్ పోల్ స్లిప్పులు  ఉండే కవర్ తెప్పించి అదనంగా ఉన్న మాక్ పోల్ స్లిప్పుల సంఖ్యను తొలగించి రిజల్ట్ అనౌన్స్ చేస్తారు....

Note: ఎక్కడైనా తేడాలు ఉన్నట్లయితే RO దృష్టికి తీసుకువెళ్లి సరి చేసుకోవాలి...


Post a Comment

0 Comments