OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

పట్టు రైతుల సమస్యలు పరిష్కరించాలని జనగామ మార్కెట్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారికి వినతిపత్రం


-ట్రేడర్స్ తో  మార్కెటింగ్ అధికారి కుమ్ముకు

 -ట్రేడర్స్ కొనుగోలు చేసిన వెంటనే రైతులకు డబ్బులు ఇవ్వాలి

-పట్టుగూళ్లకు క్వింటాకు 80వేలు ఇవ్వాలి

-2018 నుండి పెండింగ్ లో ఉన్న ఇన్సెంటివ్ తక్షణమే రైతులకు చెల్లించాలి

 తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన  కార్యదర్శి భూక్య చందు నాయక్

జనగామ: పట్టు రైతుల సమస్యలు పరిష్కరించాలని ట్రేడర్స్ పట్టుగుళ్లను కొనుగోలు చేసిన వెంటనే రైతులకు డబ్బులు ఇవ్వాలని క్వింటా పట్టుగుళ్ళకు 80000 ఇవ్వాలని 2018 నుండి పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్ తక్షణమే రైతులకు చెల్లించాలని జనగామ పట్టుగుళ్ల విక్రయ కేంద్రం కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు 

సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ మాట్లాడుతూ.........                పట్టు లేనిది ఏ శుభ కార్యం వివాహాలు విందులు జరుగట్లేదు  కానీ తెలంగాణాలో పట్టు రైతుల మనుగడ లేకుండా పోతుందని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ డిమాండ్ చేశారు.మార్కెట్ కు వస్తున్న పట్టుగూళ్ల రైతులను వ్యాపారులు అధికారులు కుమ్మక్కై దోచుకుంటున్నారని అన్నారు. మన పక్కనున్న రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో పట్టు పరిశ్రమ అభివృద్ధి దిశగా జరుగుతా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టు రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.ఈ పట్టు పరిశ్రమ నెల నెల పంట నిరుద్యోగులుగా చేయకుండా ఈ పరిశ్రమ గురించి యువతకు తెలియపరచి కొత్తవరకు ఉపాధి కల్పించే దిశగా చేయవంచు.కొత్త రైతులకు  షెడ్ కట్టుకోవడం చాలా పెట్టుబడి అవసరం దీనికి రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో 10 లక్షల రూపాయలు ఇవ్వాలని మార్కెట్లో ట్రేడర్స్ సిండికేట్ గా తయారై తక్కువ ధరకు వేలంపాటలు పడుతున్నారని ఇతర రాష్ట్రంలో మార్కెట్లలో క్వింటాలుకు 80 వేల ధర పలికితే జనగామ  మార్కెట్ లో 40 వేలకు మించి రావడం లేదని రైతులు తెలుపుతున్నానని ఒక రైతు ఒక సంవత్సరానికి సుమారు రెండు లక్షల రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సరుకు కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు ఇవ్వాలని ఉన్నప్పటికిని ఇవ్వకుండా నెలల తరబడి రైతులను తిప్పుకుంటూ న్నారని తెలిపారు.

జల్లి గుళ్లను ఇతర మార్కెట్లలో కొనుగోలుదారుల మంచి రేటు ఇచ్చి ట్రేడర్స్ తీసుకుంటే  జనగామ తిరుమలాగిరి మార్కేట్ లలో మాత్రం అతి తక్కువ ధరకే తీసుకుంటున్నారని తెలిపారు.అందుకోసం సెరి కల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు పారదర్శకంగా  వ్యవరించి రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా చూడాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2018 నుండి పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్ డబ్బులను విడుదల చేయాలని. పట్టుపురుగుల పెంపకం కోసం షెడ్ల నిర్మాణం కోసం రైతులకు ప్రోత్సాహకంగా వంద శాతం సబ్సిడీతో 10 లక్షల రుణ సహాయం చేయాలని డిమాండ్ చేశారు.

Read more:

 Cabinet Meet: మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. బండి సంజయ్‌ నిరాకరిస్తే.. ఎవరికి చోటుపై చర్చ

పట్టు రైతుల సమ స్యలు పరిష్కరించాలని జనగామ మార్కెట్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారికి వినతిపత్రం 

BRS కిరాయి గుండాలచే దారుణ హత్యకు గురి అయిన విశ్రాంత ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య గారి కుటుంబాన్ని సిపిఎం నాయకులు ఓదార్చడం జరిగింది.

  రిటైర్డ్ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలి విచారణను సిబిఐకి అప్పజెప్పాలి

Post a Comment

0 Comments