OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

కాకతీయుల కళాతోరణం, చార్మినార్ లు రాజుల వైభోగాలను గుర్తు చేసేవే కానీ తెలంగాణ జనజీవన వైవిధ్యాన్ని తెలిపేవి కావు

   కెసిఆర్ తనకు తాను తెలంగాణ ప్రభువుగా భావించి గత రాజరిక నిర్మాణాలను తెలంగాణ రాజముద్రలో పొందపరిచారు. కెసిఆర్ రూపొందించిన రాష్ట్ర చిహ్నాం లో సృజనాత్మకత లేదు, అస్తిత్వం లేదు. రాచరిక అణిచివేత గుర్తులు మాత్రమే కనిపిస్తాయి.

    కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాకతీయుల కళాతోరణం, చార్మినార్ నిర్మాణానికి రాలెత్తిన కూలీల గురించి ఆలోచిస్తుంది, ప్రభువెక్కిన పల్లకి కాదు దాని మోసిన బోయిల గురించి ఆలోచిస్తుంది... దొరకు ఈ తత్వం బోధపడదనుకుంట తన మాటకరితనంతో తెలంగాణ ప్రజలను మరోసారి పోరాటం పేర మోసం చేయ చూస్తున్నాడు.

    అణచివేతలు లేని విముక్తి కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, జరిగిన పోరాటాల ఉనికి, తెలంగాణ మాగానంలో పండించే రైతులు, సర్వ మతాల సౌభాతత్వం కనిపించే, మొత్తంగా తెలంగాణ స్తిత్వం కనిపించే చిహ్నం ఉండాలని కోరుకోవడం రేవంత్ రెడ్డి గారి తప్పా... రాజులనాటి బూజుబట్టిన చరిత్ర ను తలకెత్తుకొని అదే తెలంగాణ అస్తిత్వమని చెప్పడం సిగ్గుచేటైన విషయం అన్నది ఇప్పటికీ కెసిఆర్ తలకి ఎక్కడం లేదు.

TELANGANA NEW LOGO

    కెసిఆర్ దొర తెలంగాణ ప్రజల పై గత పది సంవత్సరాలు దొర జులుము చేస్తు నియంతృత్వపు రాచరిక పాలన చేశారు. అదే ఆలోచనలతో రాచరిక ఆనవాళ్ళు తెలంగాణ రాజముద్రలో పొందపరిచి ఇది తెలంగాణ అస్తిత్వం అంటున్నాడు. వాటిని తొలగిస్తామంటే తన అస్తిత్వం పోతుందని ఆందోళనకు సిద్దమయిండు, జనాన్ని గాయి గాయి చేయచూస్తుండు, ప్రజలు  ఆ గత్తర జోలిని బహిష్కరించ వలసిన చారిత్రిక నిర్ణయం తీసుకోవాలి.

చార్ మినార్ మన అస్తిత్వమా..

Charminar Hyderabad Telangana
Charminar Hyderabad Telangana
1591లో ప్లేగు వ్యాధి నిర్మూలన గుర్తుగా నిర్మించినదే చార్మినార్ ఇందులో ఉన్న గొప్పతనం ఆర్కిటెక్చర్ పని, గొప్ప కట్టడంగా కాదనలేము కానీ, అది తెలంగాణ అస్తిత్వం అంటే ఎలా..! నిజాం రాజ్యంలో జరిగిన అరాచకం , నిజాము తాబేదారులు గ్రామాలో సాగించిన దోపిడీ దౌర్జన్యాలు, సాయుధ పోరాటాలు, తెలంగాణ భారత దేశంలో విలీన సంఘటనల చరిత్ర అంతా చార్మినార్ ను చూసి మర్చిపోవాలా... చార్మినార్  నుంచి పొందే స్ఫూర్తి ఏందో ? కెసిఆర్ కే తెలియాలి.

కాకతీయ కళాతోరణం ఎలా స్ఫూర్తిదాయకం

KAKATHIYA THORANAM IN TELANGANA LOGO
KAKATHIYA THORANAM IN TELANGANA LOGO

కాకతీయులు కళా పోషకులు, గొప్ప శిల్పకళా నైపుణ్యం కనిపించే నిర్మాణాలు చేపట్టారు, ఆనాటి రాచరికపు వైభవాలకు ఈ నిర్మాణాలు ఒక ఆనవాళ్లు. అది మొత్తం తెలంగాణ ప్రజల వైభవం కాదు. ఆ వైభవం కింద రాలిన ప్రాణాల చరిత్ర ఎవరు రాయలేదు, వారి గురించి ఆలోచించలేదు.

kakatiya kala thoranam
kakatiya kala thoranam

     తెలంగాణ కవి దాశరథి రచించిన "ఆ చల్లని సముద్ర గర్భం" పాటను కాకతీయులకు ఆపాదిస్తే.... కాకతీయుల కళ్యాణం కోసం పనమెత్తిన రక్తం ఎంతో..., కాకతీయులను గెలిపించుటకు ఒరిగిన నరకంఠములెన్నో... గుర్తు చేసుకుంటూనే.... ఆ కళా వైభవమును ఒక చరిత్రగా గౌరవించుకోవాల్సిందే, కానీ కాకతీయుల బలవంతపు పన్నుల వసూళ్లపై పోరాడిన సమ్మక్క - సారక్క, జంపన్నల పోరాటాన్ని, వారి త్యాగాన్ని కళాతోరణం లో ఎక్కడ జతకట్టాలి. ఈ వైరుధ్యాన్ని ఎలా చూడాలి మనం.* 

కాకతీయుల శిల్పకళ చరిత్రలో దాగి ఉంటే సమ్మక్క సారక్కల చరిత్ర కోట్లాది జనం గుండెల్లో నేటికీ జ్వలిస్తుంది, పూజింపబడుతుంది ఇవాళ దేని నుంచి స్ఫూర్తి పొందుదాం. పోరాట యోధుడిగా చెప్పుకునే కేసీఆర్ గారే చెప్పాలి.


ఏ రాష్ట్ర చిహ్నాల్లో కూడ రాచరికపు నిర్మాణాలు లేవు

    దేశంలో 29 రాష్ట్రాల రాజముద్రంలో ఎవరు రాచరికపు చిహ్నాలు పొందపరచలేదు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం తప్పా , సంయుక్త భారత దేశంలో ఏ రాష్ట్రాల రాజముద్రలో రాచరికపు గుర్తులు లేవు. ఆయా రాష్ట్రాల్లో ప్రాముఖ్యత కలిగి ఉన్న జంతువులు, పంటలు దేవాలయాలు, నదులు పోరాట చిహ్నాలతో రాష్ట్ర రాజముద్రలను ఏర్పాటు చేసుకుంటే...., కేసీఆర్ గారు మాత్రం రాచరికపు నిర్మాణాలను మన రాజముద్రంలో పొందుపరిచి ఇదే మన తెలంగాణ ఆస్తిత్వమని నమ్మించ చూస్తున్నాడు. ఇంత చరిత్ర తెలిసి నేడు గుడ్డిగా కేసీఆర్ వాధనను నమ్ముదామా. ప్రతి రాష్ట్రంలో రాచరికపు భవనాలు, శిల్ప కట్టడాలు గుర్తించదగ్గవి ఎన్నో ఉన్నవి కానీ ఆయా రాష్ట్రాల రాజ్యముద్రలో ఎవ్వరూ పొందపరచలేదు ఇది మనం గమనించాలి.


భారత రాజముద్ర 4 సింహాల చిహ్నం రాచరికముద్రే కదా అంటున్నారు
State Emblem of India
State Emblem of India

    268-232 BC కాలంలో మూడవ మౌర్య చక్రవర్తి అయిన అశోక చక్రవర్తి గౌతమ బుద్ధుని బోధనలకు ప్రభావితుడైన చక్రవర్తి. తన ధర్మ బోధనలు స్తంభాలపై చిహ్నాలు ఏర్పాటుచేసి ప్రజలకు తెలియపరిచారు. అందులో ఒకటి (లయన్ క్యాపిటల్) 4 సింహాల శిల్పం ఎంతో అర్థవంతమైనదిగా..., కీర్తి పొందినది. ఆ నాలుగు సింహాల శిల్పాన్ని భారత రాజ్యాంగ నిపుణుల కమిటీ భారతదేశ జాతీయ చిహ్నంగా స్వీకరించింది. ఇందులో రాచరిక వైభోగం లేదు జంతువులు, ధర్మచక్రం , అశోక్ ని జ్ఞానాధాయ పాలనను చూపిస్తు... ఒకో జంతువు ఒక అర్థ సాంకేతికంగా ఉన్నాయి. ఈ చిహ్నంతో కెసిఆర్ తన రూపొందించిన తెలంగాణ చిహ్నను పోల్చడం ఆశస్పదంగా ఉంది. ఎందరో రాజులు ఉండవచ్చు కానీ పదివేల మంది రాజుల పేర్ల మధ్య అశోకుడి పేరు ఏకైక నక్షత్రంగా ప్రకాశిస్తుంది అంటాడు , హెచ్ జె వెల్స్ తను రాసిన ద అవుట్ లైన్ ఆఫ్ ద హిస్టరీ గ్రంథంలో.. అంతటి గొప్ప చక్రవర్తి రూపొందింపచేసిన గొప్ప చిహ్నాన్ని తన చిహ్నాన్ని నిలబెట్టుకోవడం కోసం అధమ స్థాయిలో చూపాలని చూస్తున్నాడు.

    80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ అశోకుని చరిత్ర గాని, నాలుగు సింహాల నేపథ్యం గాని చదవలేదా...! జాతీయ చిహ్నంగా తీసుకున్న నాలుగు సింహాల చిహ్నాన్ని రాచరికపు చిహ్నంగా ఉదాహరించడం విచారకరం

    కేసీఆర్ రూపొందించిన తెలంగాణ రాజముద్రను కచ్చితంగా మార్చవలసిందే..., తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపే గుర్తులను అందులో పొందపరచవలసిందే.. కాబట్టి కెసిఆర్ భజన బ్యాచి దొర చెప్పిన మాటలు వినక పెత్తనపు వానవాళ్లు ఉన్న చిహ్నమును వదిలి ఉద్యమస్మృతులు, పోరాటపటిమ, తెలంగాణ  పంటలు, మన సంస్కృతి గుర్తుచేసే రాజముద్రను స్వాగతించండి. తెలంగాణ ప్రజలారా ఇది ప్రజా పాలన ప్రజలే ప్రభువులు వారి పోరాటాలను మననం చేసుకోనే, తెలంగాణ దశాబ్ద ఉత్సవాల్లో పాల్గొనండి.

                                      జై తెలంగాణ


Post a Comment

0 Comments