BRS కిరాయి గుండాలచే దారుణ హత్యకు గురి అయిన విశ్రాంత ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య గారి కుటుంబాన్ని ఓదార్చడం కోసం జనగామ నుండి బచ్చన్నపేట చౌరస్తా మీదుగా రామకృష్ణయ్య ఇంటికి సీపీఎం శ్రేణులు చేరుకొని వారి భార్య పద్మను కుమారులైన నల్ల అశోక్ శ్రావణ్ రాజు కూతురు నిర్మాలను ప్రియాంకలను పోచన్నపేటలోని వారి స్వగ్రామంలో సిపిఎం జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ఇంటికి వెళ్లి వారిని ఓదార్చడం జరిగింది.
రామకృష్ణయ్య హత్య జరిగిన ఉదాంతాన్ని వారి కుమారుడు అశోక్ వివరించగా అక్కడి వారందరూ కంటతడి పెట్టారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి వారితో మాట్లాడుతూ భవిష్యత్తులో అండగా ఉంటమని రామకృష్ణయ్య ఆశయాలు సాధించడం కోసం 174 సర్వేనెంబర్ భూమి పేదలకు దక్కెంత వరకు సిపిఎం పోరాడుతుందని రామకృష్ణయ్య హత్యకు పాత్రధారులు అందరు వెలుగులోకి రావాలంటే సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈకేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టి హత్య రాజకీయాలకు పాల్పడుతున్న BRS నాయకుడు గిరబోయిన ఆంజయ్యను జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మిని వారికి సహకరించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని బచ్చన్నపేట పోలీసు ఎస్సై నవీన్ కుమార్ ను నర్మేట సిఐ నాగబాబును కేసులో ముద్దాయిలుగా చేర్చి ప్రాసిక్యూట్ చేసి కఠినంగా శిక్షించాలి రామకృష్ణయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అలాగే రామకృష్ణయ్య భార్యకు కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్గ్రేషియో ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కణకారెడ్డి మరియు ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది.
ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాంబరాజు యాదగిరి రాపర్తి రాజు సింగారపు రమేష్ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి ప్రకాష్ జోగు ప్రకాష్ సుంచు విజేందర్ బోడ నరేందర్ మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దూసరి నాగరాజు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సందీప్ జిల్లా అధ్యక్షులు తుటి దేవదానం సిపిఎం నాయకులు కళ్యాణం లింగం మహిళా సంఘం నాయకురాలు బూడిద అంజమ్మ పల్లెర్ల లలిత పందిళ్ళ కళ్యాణి సుంచు రజిత రామగళ్ళ అశోక్ అన్నబోయిన రాజు పర్వతం నరసింహులు కడకంచి బాలరాజు గంగరబాయిన సమ్మయ్య కళ్లెం రమేష్ కంత్రి ఐలయ్య ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
0 Comments