జనగామ :గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలను జూలై 5వ తేదీ లోపు పరిష్కరించకుంటే జులై 6 నుండి నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఉద్యోగ కార్మికులకు గ్రామపంచాయతీ యూనియన్ జనగామ జిల్లా జేఏసీ చైర్మన్ రాపర్తి రాజు పిలుపునిచ్చారు
శుక్రవారం జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా జేఏసీ సమావేశానికి జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మల్లాచారి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ రాపర్తి రాజు మాట్లాడుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ సిబ్బందినందర్నీ పర్మినెంట్ చేయాలని, అన్నారు పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం మున్సిపల్ కార్మికుల వలె కేటగిరీల వారీగా వేతనాలు రూ. 15,600/-లు, రూ. 19,500/-లు, రూ.22,750/- లుగా పెంచాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, డిమాండ్ చేశారు కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని, | పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, జూన్ 5వ తేదీన గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జెఏసి పంచాయతీరాజ్ శాఖ | కమీషనర్ గారికి 17 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీస్ ను అందజేయడం జరిగింది. అని తెలిపారు జెఏసి | ఇచ్చిన డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని, లేని యెడల ఏ రోజునుండైనా రాష్ట్ర వ్యాప్తంగా నిరోధిక సమ్మె చేపడతామని తెలియజేయడం జరిగింది. రోజులు గడిచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జెఏసి డిమాండ్లపై స్పందించలేదని అన్నారు . ప్రధాన సమస్యల పైన ఎటువంటి స్పష్టత రాకపోవడంతో జెఏసి ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం జూలై 6వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపడతామని తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జెఏసి రాష్ట్ర నాయకత్వం కమీషనర్ కు తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించీ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జేఏసీ జిల్లా కన్వీనర్లు నా రోజు రామచంద్రం బత్తిని వెంకన్న బస్వ రామచంద్రం గుర్రం లాజర్ జేఏసీ జిల్లా మండల నాయకులు గొడిశాల సోమయ్య మేడే దయాకర్ జి శ్యామ్ శంకర్ కున్సోత్ శాంతమ్మ ఎల్లయ్య మూడ్ రాధిక ఎల్లమ్మ పరశురాములు తదితరులు పాల్గొన్నారు.
Read More :
బచ్చన్నపేట ఎస్. ఐ సస్పెండ్ చేసిన సిపి
రిటైర్డ్ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలి విచారణను సిబిఐకి అప్పజెప్పాలి

0 Comments