రాజకీయ అహంకారంతోటి మీరేం చేసుకుంటారో చేసుకోండి? మేము నోటుబుక్కులు ఇలానే అమ్ముతామని కరాకండిగా చెప్తున్న ప్రైవేటు యాజమాన్యం పై జిల్లా విద్యాధికారులు నోరు మెదకపోవడం లో అంతటి ఏమిటి??.....
జిల్లాలో ప్రవేట్ పాఠశాలలపై పట్టించుకునే నాధుడే కరువయ్యారు.....
జనగామ :జనగామ SFI జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం కి జిల్లా అధ్యక్షుడు సందీప్ అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ..... విద్యా హక్కు చట్టం పకడ్బందీ అమలు పరచడం లేదని అన్నారు GO నంబర్ 01 ప్రకారం అధిక ఫీజులు వసూలు చేయొద్దు మరియు పాఠశాలలో ఎలాంటి పుస్తకాలు యూనిఫాం అమ్మకూడదు అన్నారు GO నంబర్ 91 సెక్షన్ 8(1) ప్రకారం ఐఐటీ ఒళంపాయడ్ టెక్నో అని పేర్లతో ఫీజులు వసూలు చేస్తున్నారు అన్నారు ఇప్పటి వరకు DFRC కమిటీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు జిల్లా విద్యశాఖాధికారి మరియు కలక్టర్ చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యారు అని విమర్శించారు..
విద్యార్థులను మోసం చేస్తే, పేద విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం తాగుతున్న ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాలలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వాటి గుర్తింపు రద్దయ్యే దాక పోరాడుతాం... అని హెచ్చరించారు
ప్రైవేటు యాజమన్యాలు ఎన్ని భయభ్రాంతులకు గురిచేసిన, మీ వెనుక ఎన్ని రాజకీయ అండదండలు ఉన్న మీ తాటాకు చప్పులకు భయపడడానికి మీ బానిసలం కాదు.. విద్యార్థుల పక్షాన, న్యాయం కోసం పోరాడే సంఘ నాయకులం...
ఒకవైపు విద్య హక్కు చట్టం పటిష్టంగా అమలు చేయాలని , ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీ అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే, స్కూల్లో నోట్ బుక్స్, ఏ రకమైన పాఠ్యపుస్తకాలు అమ్మకూడదని బలంగా చెబుతున్నా, వాటిని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను, జిల్లా విద్యాధికారుల ఆదేశాలను భేకతార్ చేస్తున్న వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.... విద్యను వ్యాపారం చేస్తూ పేద విద్యార్థుల దగ్గర నుండి అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తూ లక్షల కోట్ల వ్యాపారం చేస్తూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు....
ప్రైవేట్ విద్యాసంస్థలపై పర్యవేక్షణ చేయకుండా, కనీసం పట్టించుకోని విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.... పట్టణంలో ఉన్న పలు పాఠశాలల ముందు పుస్తకాలు యూనిఫాం అమ్మకుడాదని ధర్నా చేశారు అనంతరం జిల్లా అదనపు కలక్టర్ గారికి మెమొరాండం అందజేశారు
ఈ కార్యక్రమంలో SFI నాయకులు తరుణ్ వికాస్ విజయ్ మహేందర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు....
0 Comments