న్యూ దిల్లీ:జూన్ 27
ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణపై పార్టీ అధిష్ఠానంతో చర్చించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాచరణను ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారు. దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. పార్టీ సీనియర్ నేతలు రాష్ట్ర నాయకులకు కొన్ని సూచనలు చేశారని అన్నారు. కర్ణాటకలో అవలంభించిన వ్యూహాల్లో కొన్నింటిని ఇక్కడ కూడా అమలు చేస్తామన్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించాలని అధిష్ఠానం సూచించినట్లు చెప్పారు. ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే.. వీలైనంత త్వరగా సరిచేసుకుంటామని తెలిపారు..
భారాసతో ఎలాంటి పొత్తులు ఉండబోవని కాంగ్రెస్ అగ్రనేతలు స్పష్టంగా చెప్పినట్లు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్, భారాస ఒకటేనని కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. జాతీయస్థాయిలోనూ ప్రతిపక్షపార్టీలతో భారాసను భాగస్వామ్యం చేయ్యబోమని అధిష్ఠానం స్పష్టం చేసిందన్నారు. 'కుటుంబ పాలన కావాలంటే కేసీఆర్‌కు ఓటు వేయండి.. ప్రజల పాలన కావాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండి' అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. ఈ సమావేశంలో అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, సంపత్ తదితరులు పాల్గొన్నారు......
నేడు తెలంగాణలో జేపీ నడ్డా పర్యటన!!
విద్యను వ్యాపారం చేస్తున్న ప్రయివేట్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి, వాటి గుర్తింపును రద్దు చేయాలి SFI జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం డిమాండ్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం
వీరనారి ఐలమ్మ నగర్ లో దొడ్డి కొండయ్య వర్ధంతి సభ
నేటి భారతదేశం కోతి చేతిలో పూల మాల రఘురామ్ రాజన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్
Cabinet Meet: మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. బండి సంజయ్ నిరాకరిస్తే.. ఎవరికి చోటుపై చర్చ
పట్టు రైతుల సమస్యలు పరిష్కరించాలని జనగామ మార్కెట్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారికి వినతిపత్రం
గిరి గ్రామాల్లో పండగ వాతావరణం. చోర్పల్లి గ్రామపంచాయతీలో పోడు రైతులకు పట్టాలు పంపిణి
లోకేశ్ ఎక్కడికి రమ్మన్నా ప్రమాణం చేసేందుకు సిద్ధం.. అనిల్ సవాల్
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
ఢిల్లీలో మరోసారి కుంగిన రోడ్డు.. భయంతో జనం పరుగులు..
పార్టీ విధానానికి కట్టుబడి ఉంటాను.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..
సర్పంచ్ నవ్య..వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్ ముగింపు?
Cabinet Meet: మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. బండి సంజయ్ నిరాకరిస్తే.. ఎవరికి చోటుపై చర్చ

0 Comments