ఆదివాసీ,గిరిజన పోడు రైతుల బ్రతుకుల్లో వెలుగును నింపిన సీఎం కెసిఆర్ :- వైస్ ఎంపీపీ ఆడే ఆత్మరామ్.
లింగాపూర్:-లింగాపూర్ మండలంలోని చోర్ పల్లి గ్రామపంచాయతీ కేంద్రంలో పోడు రైతు వ్యవసాయదారులకు అటవీ హక్కు పత్రం అందజేసిన మండల ప్రజాప్రతినిధులు.
ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు ఆత్రం అనిల్ కుమార్ మాట్లాడుతూ...పోడు రైతులకు హక్కులు కల్పించేందుకు పోడు హక్కుల చట్టం ఏర్పాటు చేశారు.75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్ర ఇప్పటివరకు గత ప్రభుత్వాలు 3లక్షల ఎకరాలకు పట్టాల చేశాయి. కానీ, సీఎం కేసీఆర్ 9ఏళ్ల పరిపాలనలోనే ఒకే రోజు 4.60లక్షల ఎకరాల పోడు పట్టాలను గిరిజనులకు అందించారని, పట్టాదారులకు రైతుబంధు, రైతు భీమా కూడా ఇస్తున్న ఏకైక సీఎం కెసిఆర్ అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆడే సవిత ప్రేమ్, స్థానిక సర్పంచ్ మర్సుకోల మనోహర్,ఉపసర్పంచ్ సోయం కమలా బాయి నిలకంఠ రావు ,గ్రామ పటేల్ జంగు,సోషల్ మీడియా కన్వినర్ జాటోత్ రాహుల్, BRS నాయకులు సోయం ముకుంద్, ఆత్రం బీర్షవ్,మోతిరాం, సోనేరావు, జాధవ్ నూర్సింగ్, మంగళసింగ్ మరియు రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Read more:
లోకేశ్ ఎక్కడికి రమ్మన్నా ప్రమాణం చేసేందుకు సిద్ధం.. అనిల్ సవాల్
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
ఢిల్లీలో మరోసారి కుంగిన రోడ్డు.. భయంతో జనం పరుగులు..
పార్టీ విధానానికి కట్టుబడి ఉంటాను.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..
సర్పంచ్ నవ్య..వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్ ముగింపు?

0 Comments