హైదరాబాద్ : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును సోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గజ్వేల్‌కు బయలుదేరిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు..
గజ్వేల్‌లో శివాజీ విగ్రహం దగ్గర ఘర్షణల్లో బాధిత హిందూ యువకులను పరామర్శించడానికి వెళుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకుని ఎమ్మెల్యే రఘునందన్ రావును అరెస్ట్ చేశారు.
శివాజీ విగ్రహం ఎదుట ఓ వ్యక్తి మద్యం మత్తులో మూత్ర విసర్జన చేయడంతో గజ్వేల్ పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది. మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ముస్లిం కావడంతో అది గమనించిన హైందవ సోదరులు, శివాజీ విగ్రహం కమిటీ అయిన భగత్ యూత్ ఆధ్వర్యంలో సదరు వ్యక్తిని పట్టుకుని పోలీ్‌సస్టేషన్‌లో అప్పగించారు. అనంతరం సీఐకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని కోరారు. పోలీ్‌సస్టేషన్ నుంచి శివాజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహించి తిరిగి వస్తున్న క్రమంలో ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించగా, మధు అనే వ్యక్తి పోలీ్‌సస్టేషన్ వైపుగా వెళ్లగా, సందీప్ అనే యువకుడి తలపై బాదం మిల్క్ సీసాతో దాడిచేశారు. ఈ ఘటనలో సందీప్ తలకు గాయమవగా, హైందవులంతా కలిసి అంబేడ్కర్ చౌరస్తా వద్దకు చేరుకుని ధర్నా, రాస్తారోకో నిర్వహించారు..
Read More:
లోకేశ్ ఎక్కడికి రమ్మన్నా ప్రమాణం చేసేందుకు సిద్ధం.. అనిల్ సవాల్
గిరి గ్రామాల్లో పండగ వాతావరణం. చోర్పల్లి గ్రామపంచాయతీలో పోడు రైతులకు పట్టాలు పంపిణి
ఢిల్లీలో మరోసారి కుంగిన రోడ్డు.. భయంతో జనం పరుగులు..
పార్టీ విధానానికి కట్టుబడి ఉంటాను.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..
సర్పంచ్ నవ్య..వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్ ముగింపు?
వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసుల జారీ

0 Comments