OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

Our Society News 07-05-2023

 Cabinet Meet: మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. బండి సంజయ్‌ నిరాకరిస్తే.. ఎవరికి చోటుపై చర్చ 


ఇవాళ ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై స్పష్టత వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి..

ఈనేపథ్యంలో తెలంగాణ నుంచి మోడీ కేబినెట్‌లో ఎవరికి అవకాశం దక్కుతుందనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్రమంత్రి పదవుల రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బండి సంజయ్‌కు కేంద్ర కేబినెట్‌లో చేరేందుకు నిరాకరిస్తే.. రాష్ట్రం నుంచి ఎవరికి చోటు కల్పిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు నిజామాబాద్‌ నుంచి ధర్మపురి అరవింద్‌, ఆదిలాబాద్‌ నుంచి సోయం బాపురావు, యూపీ నుంచి రాజ్యసభకు నామినేట్‌ అయిన కె.లక్ష్మణ్‌లు బీజేపీ ఎంపీలుగా ఉన్నారు. దీంతో వీరిలో ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం లేదు. వీరిలో కె.లక్ష్మణ్ ఇప్పటికే పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. మరోవైపు మంగళవారం ఎంపీ సోయం బాపురా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు ఆయన్ను ఢిల్లీకి పిలిపించారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణ జరిగితే తెలంగాణకు చెందిన ఇద్దరికి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది

ఢిల్లీలో మరోసారి కుంగిన రోడ్డు.. భయంతో జనం పరుగులు.. 

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జనక్ పురి ప్రాంతంలోని ప్రధాన రహాదారిపై రోడ్డు కుంగిపోయిన సంఘటన ఈరోజు ఉదయం చోటుచేసుకుంది.. బుధవారం ఉదయం ఢిల్లీ జనక్ పురి ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో రోడ్డు మధ్యలో పెద్ద గుంత ఏర్పడింది.

కనీసం నాలుగు గజాల వ్యాసం పొడవు, వెడల్పుతో వృత్తాకారంలో గజం లోతు గుంత ఏర్పడటంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురై పరుగులు తీశారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై పెద్దగా ఏర్పడిన గొయ్యి చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటుచేసి ట్రాఫిక్ మళ్లించారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు..

Read More:

 లోకేశ్‌ ఎక్కడికి రమ్మన్నా ప్రమాణం చేసేందుకు సిద్ధం.. అనిల్ సవాల్

 గిరి గ్రామాల్లో పండగ వాతావరణం. చోర్పల్లి గ్రామపంచాయతీలో పోడు రైతులకు పట్టాలు పంపిణి

 పట్టు రైతుల సమస్యలు పరిష్కరించాలని జనగామ మార్కెట్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారికి వినతిపత్రం 

  BRS కిరాయి గుండాలచే దారుణ హత్యకు గురి అయిన విశ్రాంత ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య గారి కుటుంబాన్ని సిపిఎం నాయకులు ఓదార్చడం జరిగింది.

  రిటైర్డ్ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలి విచారణను సిబిఐకి అప్పజెప్పాలి


దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

హైదరాబాద్ : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును సోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గజ్వేల్‌కు బయలుదేరిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు..


గజ్వేల్‌లో శివాజీ విగ్రహం దగ్గర ఘర్షణల్లో బాధిత హిందూ యువకులను పరామర్శించడానికి వెళుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకుని ఎమ్మెల్యే రఘునందన్ రావును అరెస్ట్ చేశారు.

శివాజీ విగ్రహం ఎదుట ఓ వ్యక్తి మద్యం మత్తులో మూత్ర విసర్జన చేయడంతో గజ్వేల్‌ పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది. మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ముస్లిం కావడంతో అది గమనించిన హైందవ సోదరులు, శివాజీ విగ్రహం కమిటీ అయిన భగత్‌ యూత్‌ ఆధ్వర్యంలో సదరు వ్యక్తిని పట్టుకుని పోలీ్‌సస్టేషన్‌లో అప్పగించారు. అనంతరం సీఐకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని కోరారు. పోలీ్‌సస్టేషన్‌ నుంచి శివాజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహించి తిరిగి వస్తున్న క్రమంలో ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించగా, మధు అనే వ్యక్తి పోలీ్‌సస్టేషన్‌ వైపుగా వెళ్లగా, సందీప్‌ అనే యువకుడి తలపై బాదం మిల్క్‌ సీసాతో దాడిచేశారు. ఈ ఘటనలో సందీప్‌ తలకు గాయమవగా, హైందవులంతా కలిసి అంబేడ్కర్‌ చౌరస్తా వద్దకు చేరుకుని ధర్నా, రాస్తారోకో నిర్వహించారు..

Read More:

 లోకేశ్‌ ఎక్కడికి రమ్మన్నా ప్రమాణం చేసేందుకు సిద్ధం.. అనిల్ సవాల్

 గిరి గ్రామాల్లో పండగ వాతావరణం. చోర్పల్లి గ్రామపంచాయతీలో పోడు రైతులకు పట్టాలు పంపిణి

 పట్టు రైతుల సమస్యలు పరిష్కరించాలని జనగామ మార్కెట్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారికి వినతిపత్రం 


లోకేశ్‌ ఎక్కడికి రమ్మన్నా ప్రమాణం చేసేందుకు సిద్ధం.. అనిల్ సవాల్


నెల్లూరు: టీడీపీ యువనేత నారా లోకేషశ్‌కు (TDP Leader Nara lokesh) ఎమ్మెల్యే అనిల్ కుమార్ (MLA Anilkumar) సవాల్ విసిరారు. అధికారంలో ఉండి తాను వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించానని చెబుతున్న నారా లోకేశ్‌..

సిట్ కాకపోతే సీబీఐ వేసుకోవాలని.. రాజకీయాల్లోకి వచ్చి తాను ఆస్తులు పోగొట్టుకున్నానని. దీనిపై తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి ప్రమాణం చేయమన్నా సిద్ధమని స్పష్టం చేశారు. ''రాజకీయాల్లోకి రాకముందు మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తిలో కంటే ఒక్క పైసా ఎక్కువ ఉన్నా, భగవంతుడు నన్ను శిక్షిస్తాడు. లోకేష్...

ఎక్కడకి రమ్మన్నా నేను ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఇస్కాన్ సిటీలో పద్దెనిమిదిన్నర ఎకరాలు ఉంటే ప్రస్తుతం అమ్మివేసి మూడు ముక్కలుగా ఎకరా మాత్రమే ఉంది. ఆరోపణ చేసేటప్పుడు సిగ్గుండాలి. ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్న మూడు ఎకరాలని అమ్మేశా.

టేక్కేమిట్ట స్థలం కూడా అమ్మి రాజకీయాలు చేశా. నా తమ్ముడు అశ్విన్ మొదటి నుంచి ఒక హాస్పిటల్లో షేర్ హోల్డర్‌గా ఉన్నాడు. గంజాయి తరలించే ముఠాకి టీడీపీ నేతలు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించాలని సాక్షాత్తు నీ పక్కన ఉన్న నెల్లూరు ఇంచార్జ్ నాకు రూ.50 లక్షలు పంపితే నేను వెనక్కి పంపా. దీనిపై ఇప్పటి వరకు ఆ పెద్దమనిషి నోరు విప్పి మాట్లాడలేదు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు పోతుంటే హైదరాబాదుకు వెళ్లి దాక్కున్న నారాయణ, నేడు రావడానికి సిగ్గుండాలి. ఇలాంటి విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తి గొప్పవాడని లోకేష్ చెప్పటానికి సిగ్గుండాలి'' అంటూ అనిల్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆదివాసీ,గిరిజన పోడు రైతుల బ్రతుకుల్లో వెలుగును నింపిన సీఎం కెసిఆర్ :- వైస్ ఎంపీపీ ఆడే ఆత్మరామ్.


లింగాపూర్:-లింగాపూర్ మండలంలోని చోర్ పల్లి గ్రామపంచాయతీ కేంద్రంలో పోడు రైతు వ్యవసాయదారులకు అటవీ హక్కు పత్రం అందజేసిన మండల ప్రజాప్రతినిధులు.

ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు ఆత్రం అనిల్ కుమార్ మాట్లాడుతూ...పోడు రైతులకు హక్కులు కల్పించేందుకు పోడు హక్కుల చట్టం ఏర్పాటు చేశారు.75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్ర ఇప్పటివరకు గత ప్రభుత్వాలు 3లక్షల ఎకరాలకు పట్టాల చేశాయి. కానీ, సీఎం కేసీఆర్ 9ఏళ్ల పరిపాలనలోనే ఒకే రోజు 4.60లక్షల ఎకరాల పోడు పట్టాలను గిరిజనులకు అందించారని, పట్టాదారులకు రైతుబంధు, రైతు భీమా కూడా ఇస్తున్న ఏకైక సీఎం కెసిఆర్ అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆడే సవిత ప్రేమ్, స్థానిక సర్పంచ్ మర్సుకోల మనోహర్,ఉపసర్పంచ్ సోయం కమలా బాయి నిలకంఠ రావు ,గ్రామ పటేల్ జంగు,సోషల్ మీడియా కన్వినర్ జాటోత్ రాహుల్, BRS నాయకులు సోయం ముకుంద్, ఆత్రం బీర్షవ్,మోతిరాం, సోనేరావు, జాధవ్ నూర్సింగ్, మంగళసింగ్ మరియు రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Read more: 

 Cabinet Meet: మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. బండి సంజయ్‌ నిరాకరిస్తే.. ఎవరికి చోటుపై చర్చ


 పట్టు రైతుల సమస్యలు పరిష్కరించాలని జనగామ మార్కెట్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారికి వినతిపత్రం


-ట్రేడర్స్ తో  మార్కెటింగ్ అధికారి కుమ్ముకు

 -ట్రేడర్స్ కొనుగోలు చేసిన వెంటనే రైతులకు డబ్బులు ఇవ్వాలి

-పట్టుగూళ్లకు క్వింటాకు 80వేలు ఇవ్వాలి

-2018 నుండి పెండింగ్ లో ఉన్న ఇన్సెంటివ్ తక్షణమే రైతులకు చెల్లించాలి

 తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన  కార్యదర్శి భూక్య చందు నాయక్

జనగామ: పట్టు రైతుల సమస్యలు పరిష్కరించాలని ట్రేడర్స్ పట్టుగుళ్లను కొనుగోలు చేసిన వెంటనే రైతులకు డబ్బులు ఇవ్వాలని క్వింటా పట్టుగుళ్ళకు 80000 ఇవ్వాలని 2018 నుండి పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్ తక్షణమే రైతులకు చెల్లించాలని జనగామ పట్టుగుళ్ల విక్రయ కేంద్రం కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు 

సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ మాట్లాడుతూ.........                పట్టు లేనిది ఏ శుభ కార్యం వివాహాలు విందులు జరుగట్లేదు  కానీ తెలంగాణాలో పట్టు రైతుల మనుగడ లేకుండా పోతుందని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ డిమాండ్ చేశారు.మార్కెట్ కు వస్తున్న పట్టుగూళ్ల రైతులను వ్యాపారులు అధికారులు కుమ్మక్కై దోచుకుంటున్నారని అన్నారు. మన పక్కనున్న రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో పట్టు పరిశ్రమ అభివృద్ధి దిశగా జరుగుతా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టు రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.ఈ పట్టు పరిశ్రమ నెల నెల పంట నిరుద్యోగులుగా చేయకుండా ఈ పరిశ్రమ గురించి యువతకు తెలియపరచి కొత్తవరకు ఉపాధి కల్పించే దిశగా చేయవంచు.కొత్త రైతులకు  షెడ్ కట్టుకోవడం చాలా పెట్టుబడి అవసరం దీనికి రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో 10 లక్షల రూపాయలు ఇవ్వాలని మార్కెట్లో ట్రేడర్స్ సిండికేట్ గా తయారై తక్కువ ధరకు వేలంపాటలు పడుతున్నారని ఇతర రాష్ట్రంలో మార్కెట్లలో క్వింటాలుకు 80 వేల ధర పలికితే జనగామ  మార్కెట్ లో 40 వేలకు మించి రావడం లేదని రైతులు తెలుపుతున్నానని ఒక రైతు ఒక సంవత్సరానికి సుమారు రెండు లక్షల రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సరుకు కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు ఇవ్వాలని ఉన్నప్పటికిని ఇవ్వకుండా నెలల తరబడి రైతులను తిప్పుకుంటూ న్నారని తెలిపారు.

జల్లి గుళ్లను ఇతర మార్కెట్లలో కొనుగోలుదారుల మంచి రేటు ఇచ్చి ట్రేడర్స్ తీసుకుంటే  జనగామ తిరుమలాగిరి మార్కేట్ లలో మాత్రం అతి తక్కువ ధరకే తీసుకుంటున్నారని తెలిపారు.అందుకోసం సెరి కల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు పారదర్శకంగా  వ్యవరించి రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా చూడాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2018 నుండి పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్ డబ్బులను విడుదల చేయాలని. పట్టుపురుగుల పెంపకం కోసం షెడ్ల నిర్మాణం కోసం రైతులకు ప్రోత్సాహకంగా వంద శాతం సబ్సిడీతో 10 లక్షల రుణ సహాయం చేయాలని డిమాండ్ చేశారు.

READ MORE :

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి అరుదైన గౌరవం

 ప్రధాని ఇంట అర్ధరాత్రి బీజేపీ కీలక నేతలు.. వాటి గురించే చర్చ!

గృహ సంపర్క్ యాత్ర

Heavy Rains: హిమాచల్‌లో జలదిగ్బంధంలో 300 రోడ్లు.. నిలిచిన చార్‌ధామ్ యాత్ర..

నేడు తెలంగాణలో జేపీ నడ్డా పర్యటన!!

విద్యను వ్యాపారం చేస్తున్న ప్రయివేట్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి, వాటి గుర్తింపును రద్దు చేయాలి SFI జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం డిమాండ్



Post a Comment

0 Comments