OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

ప్రధాని ఇంట అర్ధరాత్రి బీజేపీ కీలక నేతలు.. వాటి గురించే చర్చ!

న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇంట బుధవారం అర్ధరాత్రి ఈ సమావేశం జరగ్గా..

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సీనియర్‌ నేతలు కొందరు హాజరయ్యారు. 

ప్రధాని మోదీ ఇటీవలె అమెరికా, ఈజిప్ట్‌ పర్యటన ముగించుకుని వచ్చారు. అప్పటి నుంచి వరుసగా సమావేశాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. తాజాగా బీజేపీ కార్యకర్తలను సైతం ఉద్దేశించి ప్రసంగించారాయన. అదే సమయంలో జులై 17 నుంచి వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కీలక నేతలంతా అర్ధరాత్రి సమావేశమై చర్చించడం గమనార్హం. 

బీజేపీ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశంలో.. అభ్యర్థుల జాబితా తయారు, బీజేపీ మేనిఫెస్టో రూపకల్పన గురించి ప్రధానంగా చర్చించినట్లు భోగట్టా. ఎన్నికల అంశంతో పాటు ప్రధానంగా వర్షాకాల సమావేశాల్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరపాలని కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అందునా తాజాగా ప్రధాని గళం వినిపించిన యూనిఫామ్‌ సివిల్‌కోడ్‌ను మేనిఫెస్టోలో కొనసాగించే అంశాన్ని సైతం లేవనెత్తినట్లు ఓ బీజేపీ కీలక నేత చెబుతున్నారు. ఈ భేటీ ఆధారంగా.. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం వీలైనంత త్వరలో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. 

READ MORE :

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి అరుదైన గౌరవం

వీరనారి ఐలమ్మ నగర్ లో దొడ్డి కొండయ్య వర్ధంతి సభ

నేటి భారతదేశం కోతి చేతిలో పూల మాల రఘురామ్ రాజన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్

Cabinet Meet: మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. బండి సంజయ్‌ నిరాకరిస్తే.. ఎవరికి చోటుపై చర్చ

పట్టు రైతుల సమస్యలు పరిష్కరించాలని జనగామ మార్కెట్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారికి వినతిపత్రం

గిరి గ్రామాల్లో పండగ వాతావరణం. చోర్పల్లి గ్రామపంచాయతీలో పోడు రైతులకు పట్టాలు పంపిణి

లోకేశ్‌ ఎక్కడికి రమ్మన్నా ప్రమాణం చేసేందుకు సిద్ధం.. అనిల్ సవాల్

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

ఢిల్లీలో మరోసారి కుంగిన రోడ్డు.. భయంతో జనం పరుగులు..

పార్టీ విధానానికి కట్టుబడి ఉంటాను.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..

సర్పంచ్ నవ్య..వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్‌ ముగింపు?

 Cabinet Meet: మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. బండి సంజయ్‌ నిరాకరిస్తే.. ఎవరికి చోటుపై చర్చ




Post a Comment

0 Comments