వరంగల్ జిల్లా :జులై 05
సర్పంచ్ నవ్య వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్‌లో పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. నవ్య ఆరోపణల్లో వాస్తవాలు లేవని పోలీసులు తేల్చారు. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్‌కు నివేదిక సమర్పించారు. రెండు పర్యాయాలు నోటీసులు ఇచ్చినా పోలీసులకు ఎలాంటి ఆధారాలూ నవ్య సమర్పించలేదు. నిర్ణీత సమయానికి ఆధారాలు సమర్పించని నేపథ్యంలో కేసు క్లోజ్ చేయవచ్చని పోలీసులకు నవ్య తెలిపారు. దీంతో నవ్య - రాజయ్య పంచాయతీకి తెర పడింది.
తెలంగాణ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళా సర్పంచ్ లైంగిక ఆరోపణలు తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ హన్మకొండ జిల్లా జానకీపురం సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేసింది. మాట విననందుకు తనపై రాజయ్య లైంగిక వేధింపులకు దిగుతున్నారని నవ్య పేర్కొంది. తనకు ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని.. నీ మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని వేధిస్తున్నాడని నవ్య ఆరోపించారు. మరోవైపు నవ్య తనపై చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే రాజయ్య ఖండించారు....
Read More:
Read More:
లోకేశ్ ఎక్కడికి రమ్మన్నా ప్రమాణం చేసేందుకు సిద్ధం.. అనిల్ సవాల్
గిరి గ్రామాల్లో పండగ వాతావరణం. చోర్పల్లి గ్రామపంచాయతీలో పోడు రైతులకు పట్టాలు పంపిణి
0 Comments