హైదరాబాద్:జూన్ 29
నగరంలోని ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లో తుపాకీ మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ రామయ్య మృతి చెందాడు. రామయ్య మింట్ కాంపౌండ్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లో సెక్యూరిటీగా ఉన్నారు. గురువారం ఉదయం తుపాకీని శుభ్రం చేస్తుండగా ఫైర్ అయినట్లుగా అధికారులు తెలిపారు. తీవ్ర గాయాలైన రామయ్యను అధికారులు హుటాహుటిన నాంపల్లి కేర్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే కానిస్టేబుల్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ రామయ్య(46) పనిచేస్తున్నారు. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లా వాసిగా తెలిసింది రామయ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే క్లూస్ టీమ్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. మిస్‌ఫైర్ జరిగిన చోటును సైఫాబాద్ సీఐ సత్తయ్య పరిశీలించారు. సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందిని సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్, సీఐ సత్తయ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు...
Read More :
నేడు తెలంగాణలో జేపీ నడ్డా పర్యటన!!
విద్యను వ్యాపారం చేస్తున్న ప్రయివేట్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి, వాటి గుర్తింపును రద్దు చేయాలి SFI జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం డిమాండ్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం
వీరనారి ఐలమ్మ నగర్ లో దొడ్డి కొండయ్య వర్ధంతి సభ
నేటి భారతదేశం కోతి చేతిలో పూల మాల రఘురామ్ రాజన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్
Cabinet Meet: మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. బండి సంజయ్ నిరాకరిస్తే.. ఎవరికి చోటుపై చర్చ
గిరి గ్రామాల్లో పండగ వాతావరణం. చోర్పల్లి గ్రామపంచాయతీలో పోడు రైతులకు పట్టాలు పంపిణి
లోకేశ్ ఎక్కడికి రమ్మన్నా ప్రమాణం చేసేందుకు సిద్ధం.. అనిల్ సవాల్
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
ఢిల్లీలో మరోసారి కుంగిన రోడ్డు.. భయంతో జనం పరుగులు..
పార్టీ విధానానికి కట్టుబడి ఉంటాను.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..
సర్పంచ్ నవ్య..వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్ ముగింపు?

0 Comments