బెంగళూరు
కర్ణాటకలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్న కూతురు కులాంతర వ్యక్తిని ప్రేమించడం ఏమాత్రం నచ్చని తండ్రి తన కూతురి గొంతు కోసి హత్య చేయడమే కాక, ప్రియుడి ఆత్మహత్యకు కూడా కారకుడయ్యాడు. కర్ణాటక లోని గోల్డ్ ఫీల్డ్ (కెజిఎఫ్) లోని బంగారు పేట నివాసి కృష్ణమూర్తి తన 20 ఏళ్ల కుమార్తె కీర్తి వేరే కులానికి చెందిన 24 ఏళ్ల గంగాధర్‌ను ప్రేమించిందని తెలిసి ఒప్పుకోలేదు. దీంతో తండ్రీ కూతుళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మంగళవారం ఉదయం కృష్ణమూర్తి గంగాధర్‌తో ఉన్న సంబంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని కూతురిని ఒప్పించడానికి ప్రయత్నించాడు. దీంతో మళ్లీ బుధవారం వారిద్దరి మధ్య గొడవ జరిగింది.
చివరకు ఘర్షణకు దారి తీయడంతో కీర్తి గొంతుకోసి కన్నతండే చంపేశాడు. ఆపై ఆత్మహత్యగా మార్చడానికి ఆమె శవాన్ని ఫ్యాన్‌కు వేలాడ దీశాడు. తన ప్రియురాలి మరణం విషయం తెలిసి గంగాధర్ తీవ్ర మనస్తాపం చెందాడు. ఎదురుగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీస్‌లు కృష్ణమూర్తి ఇంటికి చేరుకుని కీర్తి మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గురైందన్న అనుమానంతో కృష్ణమూర్తిని విచారించగా అసలు విషయం బయటపడింది. తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న గంగాధర్ కీర్తి మృతి విషయం తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీస్‌లు తెలిపారు. నిందితుడు కృష్ణమూర్తిని అరెస్టు చేసినట్టు కేజీఎఫ్ ఎస్పీ ధరణి దేవి చెప్పారు. ఈ రెండు కేసులు దర్యాప్తు చేస్తున్నారు...
Read More :
Heavy Rains: హిమాచల్‌లో జలదిగ్బంధంలో 300 రోడ్లు.. నిలిచిన చార్‌ధామ్ యాత్ర..
నేడు తెలంగాణలో జేపీ నడ్డా పర్యటన!!
విద్యను వ్యాపారం చేస్తున్న ప్రయివేట్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి, వాటి గుర్తింపును రద్దు చేయాలి SFI జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం డిమాండ్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం
వీరనారి ఐలమ్మ నగర్ లో దొడ్డి కొండయ్య వర్ధంతి సభ
నేటి భారతదేశం కోతి చేతిలో పూల మాల రఘురామ్ రాజన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్
Cabinet Meet: మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. బండి సంజయ్ నిరాకరిస్తే.. ఎవరికి చోటుపై చర్చ
గిరి గ్రామాల్లో పండగ వాతావరణం. చోర్పల్లి గ్రామపంచాయతీలో పోడు రైతులకు పట్టాలు పంపిణి
లోకేశ్ ఎక్కడికి రమ్మన్నా ప్రమాణం చేసేందుకు సిద్ధం.. అనిల్ సవాల్
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
ఢిల్లీలో మరోసారి కుంగిన రోడ్డు.. భయంతో జనం పరుగులు..
పార్టీ విధానానికి కట్టుబడి ఉంటాను.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..
సర్పంచ్ నవ్య..వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్ ముగింపు?
0 Comments