హైదరాబాద్:
కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ పేదలకు ఇచ్చిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీ జనగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు. నరేంద్ర మోదీ బీసీలకు ఇప్పటి వరకు ఏం చేయలేదన్నారు. కేసీఆర్ వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి తాహశీల్దార్‌కు పని లేకుండా చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని చెప్పారు. ప్రతి పార్లమెంట్‌లో బీసీలకు మూడు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతి జిల్లాకు తీసుకువెళ్తామన్నారు. ధరణి పోర్టల్ ద్వారా రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని.. త్వరలో బీసీ గర్జన సభ నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ బీసీ గర్జన సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఆహ్వానిస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ పని ఖతమైందన్నారు. తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణలో రైతుల చనిపోతే ఆర్ధిక సహాయం చేయని కేసీఆర్.. బీహార్, పంజాబ్ రైతులకు మాత్రం తెలంగాణ డబ్బులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల్లో చైతన్యం వచ్చిందని.. బీసీలకు టిక్కెట్లు కావాలని ఎవరు అడిగినా మంచిదే.. స్వాగతిస్తామని వి.హనుమంతరావు పేర్కొన్నారు....
Read More:
లోకేశ్ ఎక్కడికి రమ్మన్నా ప్రమాణం చేసేందుకు సిద్ధం.. అనిల్ సవాల్
గిరి గ్రామాల్లో పండగ వాతావరణం. చోర్పల్లి గ్రామపంచాయతీలో పోడు రైతులకు పట్టాలు పంపిణి
0 Comments