విశాఖ ప్రాంతాన్ని ఆనుకొని అల్పపీడనం తీరానికి చాలా దగ్గరగా ఏర్పడింది, అందువలనే నేడు తెల్లవారిజామున మధ్య తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు చూస్తూ ఉన్నాము. కానీ ఆంధ్రాలో చాలా తక్కువ చోట్లల్లో మాత్రమే వర్షాలు పడ్డాయి.
నేడు మధ్యాహ్నానికి అల్పపీడనం కాస్త ఉత్తర దిశగా కదిలి శ్రీకాకుళం - విశాఖ మధ్య ఉన్న కోస్తా భాగం వైపుగా వెళ్తుంది. దీని వలన మధ్య ఆంధ్ర జిల్లాలు - ఎన్.టీ.ఆర్., గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఉత్తర ప్రకాశం, ఉభయ గోదావరి, ఏలూరు, కొనసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. కర్నూలు, నంధ్యాల, రాయలసీమ జిల్లాల్లో చాలా భాగాల్లో నేడు తేలికపాటి వర్షాలుంటాయి. అలాగే నెల్లూరు, తిరుపతి, ప్రకాశం (మిగిలిన భాగాల్లో) తేలికపాటి వర్షాలుంటాయి.
ఉత్తరాంధ్ర జిల్లాలు - విజయనగరం, పార్వతీపురం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి జిల్లా (పశ్చిమ భాగాల్లో) భారీ వర్షాలు మధ్యాహ్నం నుంచి రాత్రి మధ్యలో ఉంటుంది. కానీ విశాఖ నగరం, విజయనగరం జిల్లా కోస్తా భాగాలు, శ్రీకాకుళం జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షాలకే పరిమితం కానుంది. ఎందుకూ అంటే సముద్రం నుంచి బలహీనమైన గాలులు భూమిలోనికి వస్తోంది కనుకనే.
0 Comments