ఛతీస్ గడ్
ప్రజల పక్షాన నిలబడి సోషలిజం-కమ్యూనిజం స్థాపించటానికి పోరాటం జరుపుతూ అమరులైన వారి త్యాగాలను గుర్తు చేసుకోవటానికి జూలై 28 నుంచి ఆగస్ట్ 9వ తేదీ వరకు అమరవీరుల సంస్మరణ వారాన్ని పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. 2022 ఆగస్ట్ నుంచి 2023 జూలై మధ్య ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ వంద మంది మావోయిస్టులు అమరులైనట్టు పేర్కొంది.
ఇక, కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ కటకం సుదర్శన్, క్రాంతి పత్రిక ఎడిటర్ ఎల్ఎస్ఎన్. మూర్తి అనారోగ్యంతో కన్ను మూశారని తెలిపింది. ఛత్తీస్ ఘడ్, తెలంగాణ గ్రే హౌండ్స్ బలగాలతో వీరోచితంగా పోరాడి అనిత, అశోక్ అమరులయ్యారని పేర్కొంది. ప్రజల సమస్యలు పరిష్కరించటానికి నిరాయుధునిగా వెళ్లిన రాజేష్ తోపాటు తునికాకు సేకరణకు వెళ్లిన ఓ గ్రామస్తున్ని పోలీసులు అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి చంపినట్టు తెలిపింది.
2047 వరకు దేశాన్ని ఆర్ధికంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందూ రాజ్యాన్ని స్థాపించటానికి కుట్రలు చేస్తున్నట్టు పేర్కొంది. అమరులైన కామ్రేడ్లు చూపించిన బాటలో నడిచి ఈ కుట్రలను తిప్పి కొట్టాలని, దీంట్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు ఇచ్చింది. అమరులను స్మరించుకుంటూ వారం రోజులపాటు దేశ వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలు, సిటీలు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, పారిశ్రామిక వాడల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది...
Read More:
లోకేశ్ ఎక్కడికి రమ్మన్నా ప్రమాణం చేసేందుకు సిద్ధం.. అనిల్ సవాల్
గిరి గ్రామాల్లో పండగ వాతావరణం. చోర్పల్లి గ్రామపంచాయతీలో పోడు రైతులకు పట్టాలు పంపిణి
BRS కిరాయి గుండాలచే దారుణ హత్యకు గురి అయిన విశ్రాంత ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య గారి కుటుంబాన్ని సిపిఎం నాయకులు ఓదార్చడం జరిగింది.
రిటైర్డ్ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలి విచారణను సిబిఐకి అప్పజెప్పాలి
READ MORE :

0 Comments