హైదరాబాద్ :
రాష్ట్రంలో ఎపుడైనా ఎన్నికలొచ్చే పరిస్థితులున్నందున ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ అందుబాటులో ఉన్న అన్నిమార్గాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుంది. ఆదివారం నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆషాడమాసపు బోనాలు జరుగుతున్నందున ఆయా ఆలయాల్లో అమ్మవారికి పట్టువస్త్రాలకు సమర్పించేందుకు ప్రజాప్రతినిధులకు అధికారికంగా ఆలయాలను కేటాయిస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సర్కారు తరపున పట్టువస్త్రాలు సమర్పించే ప్రతినిధిలా హాజరుకావాలని సూచించింది.
ఇందులో భాగంగా ఎమ్మెల్సీ, ప్రభుత్వవిప్ ఎంఎస్.ప్రభాకర్‌రావుకు కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ ఆలయం, మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి పాతబస్తీ గౌలీపురాలోని మహంకాళీ ఆలయం, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డికి ఉప్పుగూడలోని మహాంకాళీ ఆలయాన్ని కేటాయిస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ మేయర్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం ఆమె పాతబస్తీ గౌలీపురాలోని మహంకాళీ ఆలయానికి వచ్చి, పట్టువస్త్రాలు సమర్పించేందుకు హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది...
Read More:
0 Comments