బెంగళూరు: చంద్రుడికి సంబంధించి ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశమూ తీయని అద్భుతమైన ఫొటోలు తమ వద్ద ఉన్నాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. అవి తమ కంప్యూటర్ కేంద్రానికి వెళుతున్నాయని చెప్పారు. అక్కడ శాస్త్రవేత్తలు వాటిని ప్రాసెస్ చేస్తున్నారని.. త్వరలోనే ఆ ఫొటోలను విడుదల చేస్తామన్నారు. జాబిల్లిపై ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ సమర్థంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కొన్ని పరిశోధనల్లో భాగంగా రోవర్ కచ్చితంగా వేర్వేరు ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. రాబోయే 10 రోజుల్లో ల్యాండర్, రోవర్‌లు అన్ని పరిశోధనలను పూర్తిచేస్తాయని తెలిపారు. విక్రమ్ ల్యాండర్ దిగిన చోటుకు ‘శివ్‌శక్తి’ అనే పేరును ప్రధాని మోదీ పెట్టడాన్ని సోమనాథ్ సమర్థించారు. శివ్‌శక్తి, తిరంగా (చంద్రయాన్-2 కూలిన ప్రదేశానికి పెట్టిన పేరు) రెండు పేర్లూ భారతీయతకు చిహ్నమన్నారు. చంద్రుడితోపాటు అంగారక, శుక్ర గ్రహాల వద్దకు వ్యోమనౌకలను పంపే సత్తా భారత్‌కు ఉందని సోమనాథ్ స్పష్టం చేశారు. ఈ పరిశోధనల కోసం మరిన్ని పెట్టుబడులు అవసరమని తెలిపారు. ఆదివారం తిరువనంతపురంలో ఉన్న భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన సోమనాథ్.. సైన్స్, ఆధ్యాత్మికం పట్ల తనకు ఆసక్తి ఉందని తెలిపారు.
Read More :
G20 Summit: జీ20 కోసం భారత ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తుందో తెలుసా?
AP లో భారీగా బదిలీలు ఏపీ లో 35 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు
గూడూరు గ్రామం లో 8 వ వార్డులో cc రోడ్లు ఏర్పాటు చేయాలని DYFI ఆద్వర్యంలో నిరసన
# నటుడు రజినీకాంత్ కు గవర్నర్ పదవి ...❓
#బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం - నేడు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
#అర్హులందరికీ కొత్త రేషన్ కార్డ్స్ మరియు అన్ని రకాల పెన్షన్స్ ఇవ్వాలని ఇవ్వాలని సిపిఎం డిమాండ్
#చికిత్స సమయాన్ని 75% వరకు తగ్గించే క్యాన్సర్ జబ్‌ను NHS ప్రపంచంలోనే తొలిసారిగా విడుదల చేసింది
# 174 సర్వే నెంబర్ పై ఉన్న స్టేటస్కోను వెంటనే రద్దు చేయాలి
# ప్రగతి భవనం నుండి బిఆర్ఎస్ (BRS ) ఖాళీ చేసే సమయం వచ్చేసింది ---- SFI జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం
# ఎస్టి కాలనీకి విద్యుత్ అందిస్తారా.... రోడ్డేక్కామంటారా.బి.శ్రీను నాయక్.
# ISRO: మా వద్ద చంద్రుడి అద్భుత ఫొటోలు.. త్వరలో విడుదల: ఇస్రో ఛైర్మన్
Read More :
టీఎస్ ఆర్టీసీ మరో కొత్త పథకం.. త్వరలో క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం
పట్టు రైతుల సమ స్యలు పరిష్కరించాలని జనగామ మార్కెట్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారికి వినతిపత్రం
BRS కిరాయి గుండాలచే దారుణ హత్యకు గురి అయిన విశ్రాంత ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య గారి కుటుంబాన్ని సిపిఎం నాయకులు ఓదార్చడం జరిగింది.
రిటైర్డ్ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలి విచారణను సిబిఐకి అప్పజెప్పాలి
ఒక్క హైదరాబాద్ నుండే తెలంగాణకు 50 శాతం ఇన్‌కమ్ మంత్రి కేటీఆర్
హైదరాబాద్‌లో జీఎస్టీ అధికారుల కిడ్నాప్.. పోలీసుల అదుపులో నిందితులు.
త్వరలో బీసీ గర్జన సభ కాంగ్రెస్ నేత *వి హనుమంతరావు
వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసుల జారీ
.
0 Comments