కలెక్టరేట్ ఎదుట పశు మిత్రుల ధర్నా
పశు మిత్రులకు కనీస వేతనం ప్రభుత్వం నిర్ణయించి ఇవ్వాలి
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు జనగామ పశు మిత్రులకు కనీస వేతనం నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు డిమాండ్ చేశారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఏవో గారికి వినతి పత్రాన్ని అందజేశారు మరియు డిఆర్డిఏ పిడి కార్యాలయంలో వినతిపత్రాన్ని అందించారు శనివారం జిల్లా కలెక్టరేట్ ఎదుట పశుమిత్ర వర్కర్స్ యూనియన్ (సిఐటియు ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పశుమిత్రులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణమని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు
ఈ కార్యక్రమంలో పసుమిత్ర వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎండి నజియా అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషించే పాడి పరిశ్రమ సంబంధించి గత ఎనిమిది సంవత్సరాలుగా పశువులకు వివిధ రకాల వ్యాధుల బారిన పడినప్పుడు ప శుసంవర్ధక శాఖ కు పశుపోషకులకు మధ్య వారధిగా ఉంటూ శూలకు వివిధ రకాల వైద్య సేవలు అందిస్తున్న పశుమిత్రులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోవడం సరైనది కాదని విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో 2500 మంది గత ఎనిమిది సంవత్సరాల నుండి వెట్టిచాకిరి చేస్తున్నారని వీరంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారేనని ముఖ్యంగా వీళ్లంతా మహిళలని అయినప్పటికీ ప్రభుత్వం కనీసం కార్మికులుగా గుర్తించి వేతనం ఇవ్వాలనే సోయి లేకపోవడం దారుణమని అన్నారు పశుమిత్రులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు పసుమిత్రులకు యూనిఫామ్ లు ,గ్లౌజులు , మాస్కులు కిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు పని భద్రతా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి సుంచు విజేందర్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బసవ రామచంద్రు పశుమిత్ర వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కొంగరి మంగ యూనియన్ జిల్లా మండల నాయకులు కే సంధ్య రాజేశ్వరి రజిత సిహెచ్ సంధ్య వైదేహి మనీలా శ్యామల అనూష అనిత స్వప్న కే స్వప్న సిహెచ్ మంజుల ఆర్ స్వప్న శ్రీలత అనిత టి సంధ్యారాణి సిహెచ్ స్వప్న సరళ ఎం శ్రావణి వివిధ మండలాల చెందిన పశుమిత్ర వర్కర్స్ పాల్గొన్నారు
0 Comments