సీపీఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్
బచ్చన్న పేట మండలం చిన్నరాంచర్ల గ్రామ శివారు లో గల 174 సర్వే నెంబర్ ప్రభుత్వ అసైన్డ్ భూమి పై ఉన్న స్టేటస్కో ను వెంటనే రద్దు చెయ్యాలని సీపీఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్ డిమాండ్ చేశారు.ఆదివారం రోజున బచ్చన్న పేట చౌరస్తాలో సిపిఎం ఆధ్వర్యంలో 174 సర్వే నెంబర్ పై ఉన్న స్టేటస్కోను రద్దు చేయాలని కోరుతూ ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజేందర్ మాట్లాడుతూ బచ్చన్నపేట మండలం రెవెన్యూ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉన్న174 సర్వేనెంబర్ లో గల ప్రభుత్వ అసైన్డ్ భూమి అని రవణ అధికారులు తేల్చి చెప్పి నాలుగు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన బచ్చన్నపేట మండల జెడ్పిటిసి భర్త అయినా 24 అంజయ్య అధికారాన్ని అడ్డం పెట్టుకొని 174 సర్వే నెంబర్ భూమిని ఆక్రమించుకొని అట్టి భూమిపై గౌరవ తెలంగాణ హైకోర్టును తప్పుదోవ పట్టించి స్టేటస్కో ఆర్డర్ ను తీసుకువచ్చి అనేక అరాచకాలకు పాల్పడుతున్నాడని అన్నారు. 174 సర్వే నెంబర్ పై ఉన్న స్టేటస్కోను వెంటనే రద్దు చేయాలని గత రెండు సంవత్సరాల కాలం నుండి సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోలేదన్నారు. జిల్లా కలెక్టర్ గారి నిర్లక్ష్యం వలన 174 సర్వే నెంబర్ పైన స్టేటస్కోని రద్దుచేకపోవడం వలన బచ్చన్నపేట ప్రాంతంలో భూమాఫియా సుఫారి గ్యాంగులతో హత్యలు చేయిస్తున్నారని దీనివలన బచ్చన్నపేట మండల ప్రజలు అనేక భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వ భూములను కాపాడడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారని ఇప్పటికైనా 174 సర్వే నెంబర్ పై ఉన్న స్టేటస్కోను రద్దు చేయకపోతే రాబోవు కాలంలో సిపిఎం ఆధ్వర్యంలో పేదలందరిని సమీకరించి ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ పర్వతం నరసింహులు కడకంచి బాలరాజు కడకంచి మల్లయ్య తూర్పాటి యాదగిరి కడకంచి లక్ష్మీపతి భావనలపల్లి పెంటయ్య యాదగిరి గంధ మల్ల కృష్ణయ్య చెప్పాలా నరసయ్య తదితరులు పాల్గొన్నారు.Read More :
G20 Summit: జీ20 కోసం భారత ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తుందో తెలుసా?
AP లో భారీగా బదిలీలు ఏపీ లో 35 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు
0 Comments