మోకు కనకా రెడ్డి సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి
జనగామ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిపిఎం కేంద్ర కమిటీ సెప్టెంబర్ 1 నుండి 7 వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే జనగామలో సోమవారం రోజున అంబేద్కర్ చౌరస్తా వద్ద ధరలపై ముద్రించిన కరపత్రం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం కనుక రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల నుండి కొత్తగా పెళ్లయిన వారికి కొత్త రేషన్ కార్డు అన్ని రకాల పెన్షన్స్ ఇవ్వకపోవడంతో తెలంగాణలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఇండ్లు ఇండ్ల స్థలాలు లేక చాలామంది పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పాత పాతకాల అమలు చేయకుండా
కొత్త పథకాలు ప్రవేశపెడి తు ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్ ప్రభుత్వం ఇలాంటి పద్ధతులు మార్చుకొని ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో బిజెపి ప్రభుత్వం గత పది సంవత్సరాల నుండి చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా బజారున పడేస్తున్నారని అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చే ముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ పది సంవత్సరాల కాలంలో కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడబీకే పని చేస్తున్నారన్నారు ప్రభుత్వం చేస్తూ దేశ సంపదను అంబానీ ఆదానికప్పు చెప్పుతూ ఉపాధిని తగ్గిస్తున్నారు. దీనితో నిత్యవసర ధరలు పెరిగి ప్రజలకు పనులు దొరకగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి ఓట్లు వేసుకొని తర్వాత ప్రజల్ని మర్చిపోయి పాలన చేస్తున్న బిజెపి టిఆర్ఎస్
పార్టీలను రాబోయే ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపించాలని దేశాన్ని కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం కనకా రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు కళ్యాణం లింగం పల్లెర్ల లలిత బోట్ల శ్రావణ్ నాయకులు పల్లెర్ల శంకర్ బూడిది అంజమ్మ చీర రజిత బిట్ల లక్ష్మి గుంటుపల్లి బాలు పాము శ్రీకాంత్ కచ్చ గళ్ళ వెంకటేష్ కళ్యాణం కళ్యాణ్ మంతపురి మధు మంద నరసింహులు మేడ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments