అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ:-
ఎన్టీఆర్ భారతదేశ సంపద ఒక మహాశక్తి, గొప్ప వ్యవస్థ. ఇక్కడ మీ ఉత్సాహం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా.. బళ్లారిలో ఉన్నానా అన్న సందేహం కలుగుతోంది. నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందించాల్సిన విషయం.
ఎన్.టీ.రామారావు భారతదేశ కీర్తి..తెలుగువారి సంపద. మనం ఇప్పుడు చెప్పుకునే ఆహార భద్రత పథకాన్ని నాడే తీసుకొచ్చిన మహానుభావుడు. అదీ ఆయన ఆలోచన.. విశిష్టత. ఎన్టీఆర్ ఒక మహాశక్తి, ఒక గొప్ప వ్యవస్థ. ఒక్కసారి ఎన్టీఆర్ విగ్రహం చూసి ఏ సంకల్పం చేసినా అది కచ్చితంగా జయప్రదం అవుతుంది. సినీ రంగంలో ఆయన పోషించిన పాత్రలు ఎవరూ చేయలేరు. మరలా ఆయనే పుడితే తప్ప, అది సాధ్యం కాదు. రాముడు, భీముడు, కృష్ణుడు ఇలా ఏ పాత్ర అయినా దానిలో జీవించి, ప్రజల హృదయాల్లో నిలిచారు. రాజకీయాల్లోకి రావాలనుకొని ఆయన రాలేదు. తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు మనసు చలించి, తెలుగువాళ్లకు జరిగిన అగౌరవం, అవమానంపై కలత చెంది రాజకీయాల్లో అడుగుపెట్టారు. తెలుగుజాతి ఉన్నంతవరకు తెలుగువారి గుండెల్లో నిలిచే ఏకైక నాయకుడు నందమూరి తారకరామారావు. అలాంటి మహానీయుని విగ్రహం ఏర్పాటు చేసిన వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక నేతలు,అభిమానులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా అని చంద్రబాబు నాయుడు అన్నారు. బళ్ళారి కమ్మ సంఘం ఆధ్వర్యం లో ఖమ్మం భవన్ లో ఈ విగ్రహ ఏర్పాటు జరిగింది.
Read More :
AP లో భారీగా బదిలీలు ఏపీ లో 35 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు
0 Comments