OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

చట్టబద్ధంగానే విద్యార్థుల అరెస్టులు : కమిషనర్ రంగనాథ్

warangal cp arrested Kakatiya University student and produced in court

వరంగల్ జిల్లా :సెప్టెంబర్‌ 08

కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు కొట్టారన్న ప్రచారంలో నిజం లేదని, అది పూర్తిగా తప్పుడు ప్రచారమని వరంగల్‌ పోలీస్‌ కమిషన్‌ ఏవీ రంగనాథ్‌ పేర్కొన్నారు. పోలీసులు కొట్టారంటూ సోషల్‌ మీడియాలో పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

కాకతీయ యూనివర్సిటీ పీహెచ్‌డీ అడ్మిషన్ల భర్తీ విషయంలో ఈ నెల 4,5 తేదీల్లో పదిమంది విద్యార్థులు వీసీ, ప్రిన్సిపాల్‌ చాంబర్‌లోకి ప్రవేశించి దాడులు చేయడం, తలుపులు, కిటికీలు, కంప్యూటర్లు, ఇతర ఫర్నిచర్‌ ధ్వంసం చేసి ప్రొఫెసర్లను బెదిరించిన ఘటనలో కొందరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఈ ఘటన తర్వాత విద్యార్థులను పోలీసులు కొట్టినట్టు సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అయ్యాయి. ఈ ప్రచారంపై కేయూ వైస్‌ చాన్స్‌లర్‌ రమేశ్‌, ఎంజీఎం వైద్యులతో కలిసి సీపీ రంగనాథ్‌ గురువారం కలెక్టర్‌హాల్‌లో విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వీసీ చాంబర్‌లోకి ప్రవేశించి దాడులు చేసి, ఆస్తులు ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు చట్టపరంగానే వారిని అరెస్ట్‌ చేసినట్టు పేర్కొన్నారు.

వీసీ కళ్లలో ఆనందం చూసేందుకే పోలీసులు కొట్టారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను కూడా కొట్టానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర విద్యార్థుల సూచనతోనే కట్లు

అరెస్ట్‌ చేసిన విద్యార్థులను కోర్టులో హాజరుపరిచే క్రమంలో ఎంజీఎంకు తరలించి వైద్య పరీక్షలు చేయించినట్టు సీపీ తెలిపారు. న్యాయమూర్తి సూచనతో రెండోసారి కూడా వైద్య పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.

కొందరు విద్యార్థుల సూచన మేరకు అరెస్ట్‌ అయిన విద్యార్థులు కట్లు కట్టుకుని వచ్చినట్టు వివరించారు. కేయూ క్యాంపస్‌లో విద్యార్థులను అరెస్ట్‌ చేసే క్రమంలో అక్కడి సీసీకెమెరాల్లో రికార్డ్ అయినా దృశ్యాలను జడ్జి పరిశీలించినట్టు పేర్కొన్నారు.

అరెస్ట్‌ అయిన విద్యార్థుల్లో ప్రశాంత్‌కు నెల క్రితం క్రికెట్‌లో గాయమైందని, దానిని చూపించి పోలీసులు కొట్టారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అరెస్ట్‌ అయిన పదిమందిలో అంబాల కిరణ్‌, ప్రశాంత్‌పై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టి జైలుకు పంపినట్టు పేర్కొన్నారు.

వీరిపై గతంలోనూ క్రిమినల్‌ కేసులో నమోదైనట్టు తెలిపారు. అయ్యప్పస్వామిని తిట్టాడన్న కోపంతో కొన్ని నెలల క్రితం బైరి నరేశ్‌పై విద్యార్థి నాయకులు హనుమకొండలో దాడిచేశారని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారిపై బెయిలబుల్‌ కేసులు పెట్టినట్టు తెలిపారు.

నాన్‌బెయిబుల్‌ కేసులు ఎందుకు పెట్టలేదంటూ బైరి నరేశ్‌ తనకు హైకోర్టు నుంచి నోటీసులు పంపారని పేర్కొన్నారు. విద్యార్థులు తమ సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో కేయూలో అధికారులు, విద్యార్థి సంఘాలతో సమావేశమై ఇదే విషయం చెప్పినట్టు గుర్తు చేశారు

Read More :


AP లో భారీగా బదిలీలు  ఏపీ లో 35 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు

గూడూరు గ్రామం లో 8 వ వార్డులో cc రోడ్లు ఏర్పాటు చేయాలని DYFI ఆద్వర్యంలో నిరసన

# నటుడు రజినీకాంత్ కు గవర్నర్ పదవి ...❓

 #బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం - నేడు కోస్తాంధ్ర​, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

#అర్హులందరికీ కొత్త రేషన్ కార్డ్స్ మరియు అన్ని రకాల పెన్షన్స్ ఇవ్వాలని ఇవ్వాలని సిపిఎం డిమాండ్

#చికిత్స సమయాన్ని 75% వరకు తగ్గించే క్యాన్సర్ జబ్‌ను NHS ప్రపంచంలోనే తొలిసారిగా విడుదల చేసింది
174 సర్వే నెంబర్ పై ఉన్న స్టేటస్కోను వెంటనే రద్దు చేయాలి    
ప్రగతి భవనం నుండి బిఆర్ఎస్ (BRS ) ఖాళీ చేసే సమయం వచ్చేసింది ---- SFI జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం
ఎస్టి కాలనీకి విద్యుత్ అందిస్తారా.... రోడ్డేక్కామంటారా.బి.శ్రీను నాయక్.

 # ISRO: మా వద్ద చంద్రుడి అద్భుత ఫొటోలు.. త్వరలో విడుదల: ఇస్రో ఛైర్మన్‌

                           

Read More :

టీఎస్‌ ఆర్టీసీ మరో కొత్త పథకం.. త్వరలో క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ విధానం

పట్టు రైతుల సమ స్యలు పరిష్కరించాలని జనగామ మార్కెట్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారికి వినతిపత్రం 

BRS కిరాయి గుండాలచే దారుణ హత్యకు గురి అయిన విశ్రాంత ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య గారి కుటుంబాన్ని సిపిఎం నాయకులు ఓదార్చడం జరిగింది.

  రిటైర్డ్ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలి విచారణను సిబిఐకి అప్పజెప్పాలి

ఒక్క హైదరాబాద్ నుండే తెలంగాణకు 50 శాతం ఇన్‌కమ్ మంత్రి కేటీఆర్

 హైదరాబాద్‌లో జీఎస్టీ అధికారుల కిడ్నాప్‌.. పోలీసుల అదుపులో నిందితులు.

త్వరలో బీసీ గర్జన సభ కాంగ్రెస్ నేత *వి హనుమంతరావు  

వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి  సుప్రీంకోర్టు నోటీసుల జారీ

Post a Comment

0 Comments