హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. నగరంలోని ఇందిరాపార్క్ నుంచి వీఎస్‌టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో లోయల్ ట్యాంక్‌బండ్‌లోని కట్ట మైసమ్మ ఆలయం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మధ్య పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఇందిరాపార్కు ఎక్స్‌రోడ్ వైపు ట్రాఫిక్‌ను అమతించారు.దీంతో కట్టమైసమ్మ దేవాలయం వద్ద లోయర్ ట్యాంక్‌బండ్, ఎమ్మార్వో ఆఫీసు, స్విమ్మింగ్ పూల్, ఇందిరాపార్క్ ఎక్స్‌రోడ్డు వైపు వాహనదారులు వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కట్టమైసమ్మ ఆలయం వైపు వచ్చే వాహనాలను దారిమళ్లించనున్నారు. ఇందిరాపార్కు ఎక్స్ రోడ్డు వద్ద బండ మైసమ్మ, స్విమ్మంగ్ పూల్, తహసీల్దార్ ఆఫీసు, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు వాహనాలను మళ్లిస్తారు.
ఇక ఎల్బీ స్టేడియంలో మైనార్టీ లబ్ధిదారులకు సబ్సిడీ చెక్కులను మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు పంపిణీ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లోని జంక్షన్లను ఉపయోగించకపోవడం మంచిదని అధికారులు సూచించారు. దీంతో వాహనదారులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని తెలిపారు...
Read More :
G20 Summit: జీ20 కోసం భారత ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తుందో తెలుసా?
AP లో భారీగా బదిలీలు ఏపీ లో 35 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు
0 Comments