సిద్దిపేట జిల్లా
సిద్దిపేట ప్రజలకు మంత్రి హరీష్ రావు తీపి కబురు చెప్పారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వయోలా గార్డెన్‌లో బీసీ వెల్పేర్ ఆధ్వర్యంలో కులవృత్తులను ప్రోత్సహం కోసం రూ.లక్ష గ్రాంట్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని 300 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుల వృత్తులను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచన చేశారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రుణాల కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడేవారని అన్నారు. తిరిగి తిరిగి చెప్పులు అరిగేవని గుర్తుచేశారు.
నేడు ఎలాంటి డాక్యూమెంట్స్ లేకుండా నేరుగా గ్రాంట్ రూపంలో లక్ష రూపాయలు అకౌంట్‌లో పడేలా సీఎం కేసీఆర్ కృషి చేశారని తెలిపారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వం కుల వృత్తులకు పెద్దపీట వేస్తోందని అన్నారు. పూచీకత్తు లేకుండా బీసీలకు 60 శాతం సబ్సిడీ రుణాలు ఇస్తున్నామని తెలిపారు. అంతేగాక, అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. అతి త్వరలో సిద్దిపేటలో డిగ్రీ బీసీ రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు...
Read More :
G20 Summit: జీ20 కోసం భారత ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తుందో తెలుసా?
AP లో భారీగా బదిలీలు ఏపీ లో 35 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు
0 Comments