హైదరాబాద్ :జులై 30
వరద ముంపు బాధితులను పరామర్శించేందుకు వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు.పర్యటనలో భాగంగా జనగామలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వర్షాల కారణంగా అనేక జిల్లాలో ప్రజలు నష్టపోయారన్నారు. పంటలు, పశువుల, రోడ్లు కూడా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ పార్టీ బృందాలు వరద సహాయ కేంద్రాలలో తిరుగుతాయన్నారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
శనివారం నాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రాష్ట్ర నాయకత్వం కలిసి వారికి తెలంగాణలో ఏర్పడిన వరద పరిస్థితులు వివరించిందన్నారు. త్వరలోనే కేంద్ర బృందాన్ని తెలంగాణకు పంపిస్తామని షా చెప్పినట్లు కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. సోమవారం నాడు కేంద్ర బృందం తెలంగాణకు చేరు కుంటుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్‌ను కేంద్రం తీసుకుంటుందన్నారు. పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సహాయ సహకారాలు అందిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read More :
G20 Summit: జీ20 కోసం భారత ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తుందో తెలుసా?
AP లో భారీగా బదిలీలు ఏపీ లో 35 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు
0 Comments