– సచివాలయ వ్యవస్థతో ప్రజల వద్దకే పథకాలు
– జగనన్న సురక్షతో ఉచితంగా 11 రకాల సేవలు
– అధికారంలో ఉండగా ఏమీ చేయలేని టీడీపీ
– ఎన్నికలొస్తున్నాయని ప్రజలను మభ్యపెట్టే యత్నాలు
– మంచి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలి
– సీఎం ఆశయాలను అనుగుణంగా అధికారులు పనిచేయాలి
– అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నంత వరకు సంక్షేమ పథకాలు ఆగవని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. అధికారంలో ఉండగా సంక్షేమాన్ని పట్టించుకోని తెలుగుదేశం, ఆ పార్టీకి మద్దతుగా ఉన్న బీజేపీ, జనసేన పార్టీలు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. మంగళవారం నగరంలోని భవానీ నగర్, జనశక్తి నగర్, శారదానగర్‌లలో ‘జగనన్న సురక్ష’ క్యాంపులు నిర్వహించారు. వివిధ ప్రభుత్వ సేవలకు సంబంధించి లబ్ధిదారులకు ఉచితంగా ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతున్నామన్నారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ నాడు నేడు కింద వాటి రూపురేఖలు మార్చివేస్తున్నట్లు చెప్పారు. నాలుగేళ్లలో రూ. 3 లక్షల కోట్లను సంక్షేమానికి వెచ్చించామని తెలిపారు. టీడీపీ అధికారంలో ఉండగా సంక్షేమాన్ని పట్టించుకోలేదని, నేడు సీఎం జగన్ చేస్తుంటే ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఎలా మంచి చేయాలని ఆలోచించకుండా కేవలం అధికారం కోసమే ప్రతిపక్షాలు పాకులాడుతున్నాయని విమర్శించారు. సేవా దృక్పథంతో పని చేస్తున్న వాలంటీర్ల పట్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. పేదల పిల్లలు ఉన్నత చదువులు అభ్యసించేలా పునాదులు వేసిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని అన్నారు. సచివాలయ వ్యవస్థతో ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో టిడ్కో పేరుతో డబ్బులు వసూలు చేశారని, కానీ నిర్మాణాలను పునాదుల స్థాయికి కూడా తీసుకురాలేదన్నారు. త్వరలోనే 2304 మందికి ఇళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. జగనన్న కాలనీల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించి గృహ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. వన్‌టైం సెటిల్‌మెంట్ కింద నామమాత్రపు ఫీజుతో స్థలంపై సర్వహక్కులు కల్పిస్తున్నామని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. సొంత స్థలం ఉండి ఇళ్లు కట్టుకోవాలనుకునే వారు సచివాలయాల్లో సంప్రదిస్తే మంజూరు చేస్తామని అన్నారు. కామారుపల్లి లేఔట్‌లో నీరు ఊరుతోందని, అందువల్ల ప్రత్యామ్నాయ ప్రాంతంలో పట్టాలు అందిస్తామని తెలిపారు. ప్రతిక్షణం ప్రజల కోసం ఆలోచిస్తున్న ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని కోరారు. కార్యక్రమాల్లో మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్ రమణారెడ్డి, వైసీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, జేసీఎస్ కన్వీనర్లు లక్ష్మన్న, చింతకుంట మధు, వైసీపీ నేత జయరాం నాయుడు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఓబిరెడ్డి, కార్పొరేటర్లు ఎం.దేవి, వై.లక్ష్మిదేవి, సుమతి, గోగుల లక్ష్మిదేవి, హరిత, రామాంజనేయులు, రహంతుల్లా, సైఫుల్లా బేగ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్‌పీరా, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు సాకే కుళ్లాయిస్వామి, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, గృహసారథులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More :
Read More:
వరద నీటిలో చిక్కుకున్న ఒరిస్సా బస్సు
భార్య ను,అల్లున్ని కాల్చిచంపి.. తాను ఆత్మహత్య పోలీస్ ఆఫీసర్
ఆగస్టు 1న మహారాష్ట్రలో సీఎం కెసిఆర్ పర్యటన 7/30/23 12:46 PM
పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ప్రయోగం సక్సెస్
అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు జగనన్న కాలనీల సందర్శన.
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన: మంత్రి హరీష్ రావు
నేడే ఢిల్లీ బిల్లు, ప్రతిపక్షాలు "సై"- సీఎం జగన్ పైనే బీజేపీ ఆశలు..!!
గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు రిజర్వేషన్ అమలు చేయడం పట్ల హర్షం
ఎర్ర జెండా నీడలో గ్రామ కంఠం భూమి
0 Comments