ఊమెన్ చాందీ భౌతికకాయం వద్ద రాహుల్ సోనియా గాంధీ నివాళి
దిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి భేటీ
ఇల్లు కట్టుకునేవారికి రూ.3 లక్షలు
సొంత స్థలం ఉండి, ఇల్లు కట్టుకునేవారికి రూ.3 లక్షలు అందించే గృహలక్ష్మీ పథకానికి త్వరలోనే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.! 🖥️ఆన్లైన్లోనే కాకుండా స్థానిక ఎమ్మెల్యే, మంత్రులకు కూడా నేరుగా దరఖాస్తు సమర్పించే అవకాశాన్ని ప్రభుత్వ కల్పించింది..! ✍🏻కలెక్టర్ ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలించి, ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందిని ఈ పథకానికి ఎంపిక చేస్తారు.!కేరళ మాజీ సీఎం కన్నుమూత
నేడు విద్యాశాఖ కార్యాలయం ముట్టడి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చినట్లుగా 12 వేల టీచర్ పోస్టులకు వెంటనే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలని డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మొన్నటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోస్ట్ కార్డులు రాసి నిరసన తెలిపారు. కాగా మంగళవారం విద్యాశాఖ ముట్టడికి పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు లక్డీకాపూల్ లోని విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని, కొనసాగిస్తామని డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్ మోహన్ రెడ్డి తెలిపారు........
మచిలీపట్నానికి లెనిన్కుమార్ భౌతికకాయం
కృష్ణా జిల్లా ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన తెలుగు విద్యార్థి లెనిన్ నాగకుమార్ ఈతకెళ్లి ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే.స్నేహితులతో కలిసి కెనడాలోని సిల్వర్‌ఫాల్స్‌కు వెళ్లిన లెనిన్ ప్రాణాలు కోల్పోయాడు. రెండు వారాల క్రితం మృతిచెందిన లెనిన్ భౌతికకాయం మంగళవారం నాడు స్వగ్రామమైన మచిలీపట్నానికి చేరింది. MS కోసం 2021లో చింతగుంటపాలెం వాసి లెనిన్ కెనడా వెళ్లాడు. అక్కడ MS పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉండగా.. జులై 4న కెనడాలోని సిల్వర్ వాటర్ ఫాల్స్లో పడి మృతి చెందాడు...
రాజానగరం హైవే పై అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకున్న సివిల్ సప్లై అధికారులు
తూర్పుగోదావరి జిల్లా చింతలపూడి మండలం పోతునూరు సాయికృష్ణ ట్రేడర్స్ దగ్గర నుంచి కాకినాడ పోర్టుకు తరలి వెళుతుండగా రాజానగరం వద్ద పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు..!! మొన్న పోతునూరులో కేసు నమోదు చేసిన ప్రాంతం నుంచే కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం అక్రమ రవాణ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం
అయితే ఇది చింతలపూడి నుంచి కాకుండా తిరువూరు నుంచి కాకినాడ పోర్టుకు వెళుతున్నట్లు అధికారులకు లారీ డ్రైవర్ తో చెప్పించిన అక్రమ రేషన్ మాఫియా దారులు తాడేపల్లిగూడెం మండలంలోని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిది ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా మాఫియా డాన్ అని సమాచారం. ఈ అక్రమ రవాణాలో అసలు సూత్రధారి అయినా ఆ డాన్ తప్పుకుని కేవలం పాత్రధారులను కేసులో ఇరికించినట్లుగా తెలుస్తుంది. ఇందులోనూ పెద్ద స్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి ఇప్పటి కేవలం రెవిన్యూ 6A కేసు మాత్రమే నమోదు
చిన్నపాటి రేషన్ బియ్యం అక్రమ రవాణాకే 7(1) పోలీసు చీటింగ్ కేసు నమోదుచేసే అధికారులు ఈ కేసు విషయంలో ఉదాసీన వైఖరి అవలంబించడం పట్ల వెల్లువెత్తుతున్న విమర్శలు.
సుమారు 25 టన్నులు రేషన్ అక్రమ రవాణాలో దొరికాయి కనుక 7(1) నమోదు చేయాలని. బియ్యం అక్రమ రావణ దారు నాయుడు, లారీ ఓనర్ శ్రీహరి, డ్రైవర్ సొంబాబు తో పాటుగా వీరి వెనుక వున్న తాడేపల్లిగూడెం మండల ప్రజాప్రతినిధి పైనా కేసు నమోదు చెయ్యలని డిమాండ్.
తినే పులసల సీజన్ యానాం లో మొదలైంది
యానాం మాంసాహార ప్రియులు అత్యంత ఇష్టంగా తినే పులసల సీజన్ యానాం లో మొదలైంది. యానాం గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన సమయంలో పులసలు లభ్యమవుతాయి. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సుమారు మూడు కేజీలు మొట్టమొదటి పులస వలకి చిక్కింది.. దీనిని వేలం పాటలో మార్కెట్ లో చేపల విక్రయించే తల్లి కూతుర్లు నాటి పార్వతి, ఆకుల సత్యవతి 13000 కి వేలంపాటలో అత్యధిక ధరకు దక్కించుకున్నారు. భీమవరానికి చెందిన ఒక వ్యక్తి కి15 వేలకు పులస చేపను విక్రయించినట్లు తెలిపారు.
తిరుపతి జిల్లాలో నేడు జమ చేయబడిన జగనన్న తోడు రుణాలు
7 వ విడత వడ్డీ రీయింబర్స్మెంట్ పొందిన లబ్దిపొందిన వారి వివరాలు : జిల్లాలో నియోజకవర్గాల వారీగా
చంద్రగిరి 6745 మంది లబ్దిదారులకు రూ. 2.98 కోట్లు, గూడూరు 5559 మంది లబ్దిదారులకు రూ.2.34 కోట్లు , నగిరి (పార్ట్ ) 2072 మంది లబ్దిదారులకు రూ.0.87 కోట్లు, సత్యవేడు 5064 మంది లబ్దిదారులకు రూ. 2.20 కోట్లు, శ్రీకాళహస్తి 6004 మంది లబ్దిదారులకు రూ.2.71 కోట్లు, సూళ్ళురుపేట 5183 మంది లబ్దిదారులకు రూ. 2.33 కోట్లు, తిరుపతి 7064 మంది లబ్దిదారులకు రూ.3.16 కోట్లు , వెంకటగిరి 2609 మంది లబ్దిదారులకు రూ.0.98 కోట్లు, వెరసి మొత్తం 40,300 మంది లబ్దిదారులకు సంబందించిన రూ.17.57 కోట్లు మెగా చెక్కును జిల్లా కలెక్టర్ లబ్దిదారులకు అందజేశారు.
శ్రీపద్మావతి మెడికల్ కళాశాల లో జరిగిన క్యాన్సర్ అవగాహన పై శిక్షణ కార్యక్రమం
తిరుపతి స్విమ్స్ (శ్రీపద్మావతి మెడికల్ కళాశాల) లో జరిగిన క్యాన్సర్ అవగాహన పై ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి ఈఓ శ్రీ ధర్మారెడ్డి .,కలెక్టర్ శ్రీ కే.వెంకట రమణా రెడ్డి ., జే ఈ ఒ శ్రీమతి సదా భార్గవి డి యం & హెచ్ ఒ డా.శ్రీహరి తదితరులు...
జగనన్న తోడు చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు
5,10,412 మంది లబ్ధిదారులకు రూ.560.73 కోట్ల లబ్ధి. ఒక్కొక్కరికీ రూ.10 వేల నుంచి ..రూ.13 వేలు వడ్డీలేని రుణాలు కొత్తగా మరో 56 వేల మందికి జగనన్న తోడు రూ.11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ కూడా విడుదల ఇప్పటి వరకూ రూ.2,955 కోట్ల వడ్డలేని రుణాలు చిరు వ్యాపారాలు చేసుకునేవారికి .. రూ.549.70 కోట్ల వడ్డీలేని రుణాలు గతంలో రుణాలు తీసుకుని చెల్లించిన వారికి.. రూ.11.03 కోట్లె వారి ఖాతాల్లో జమ ప్రభుత్వం రూ.10వేల రుణం అందజేయడంతోపాటు.. తీసుకున్న రుణానికి ప్రతి నెలా కిస్తీల రూపంలో చెల్లించినవారికి రుణంపై అయ్యే వడ్డీ మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తోంది జగనన్న తోడు పథకంలో అత్యధికంగా 80 శాతం లబ్ధి పొందేది మహిళలే ఇప్పటి వరకు మొత్తం రుణ సాయం రూ.2,955.79 కోట్లు ఇప్పటి వరకూ 7 విడుతలుగా చిరు వ్యాపారులకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు మొదటి విడతలో రూ.10 వేల రుణం తీసుకుని.. నిర్ణీత కాలంలో చెల్లించినవారికి. రెండో విడత వెయ్యి పెంచి రూ.11 వేలు. రెండో విడత రుణం కూడా చెల్లించిన వారికి మూడో విడతలో రూ.12వేలు ఇలా ప్రతి ఏటాపెంచుతూ జగనన్న ప్రభుత్వం రుణాలు అందజేస్తోంది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15,87,492 మంది జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందారు 13,12,011 మంది పాత రుణం చెల్లించి. రెండు మూడు సార్లు కొత్త రుణాలు పొందారు గత ఆరు విడతల్లో చిరు వ్యాపారులకు 29,16,504 రుణ ఖాతాల ద్వారా. రూ.2406.09 కోట్ల రుణాలను అందజేయగా ఏడో విడతలో అందజేసే రుణ సహాయంతో కలిపి రూ.2,955.79 కోట్ల రుణం సాయంచేసింది ప్రభుత్వం ఇప్పుడు ఏడో విడతలో 5,10,412 మందికి ప్రభుత్వం రుణాలు అందజేస్తుండగా అందులో 4,54,267 మంది గతంలో ఒకటి కంటే ఎక్కువ సార్లు రుణం పొంది తిరిగి చెల్లించినవారు ఈ సారి కొత్తగా మరో 56,145 మందికి తొలిసారి ఈ పథకం ద్వారా రుణం అంజేశారు ఇప్పటి వరకు రూ.74.69 కోట్లు వడ్డీ జమ.
బీర్ బాటిల్స్ కోసం దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ శివారు మీర్‌పేట పరిధిలో దారుణం జరిగింది. బీర్ బాటిల్స్ కోసం ఓ వ్యక్తితో గొడవ పెట్టుకుని.. అతన్ని కత్తితో కిరాతకంగా హత్య చేశారు.
మృతుడ్ని సాయి వరప్రసాద్‌గా నిర్ధారించారు పోలీసులు. జిల్లెలగూడ నుంచి సాయి వరప్రసాద్.. బీరు బాటిల్స్ కొనుక్కుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొందరు యువకులు.. అతన్ని అడ్డుకుని బాటిల్స్ తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అందుకు అతను ససేమీరా అనడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కత్తితో సాయిపై ఆ యువకులు దాడి చేశారు. రక్తపు మడుగులో అక్కడికక్కడే సాయి కుప్పకూలిపోయాడు.బీర్ బాటిల్ హత్య ఉదంతంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన మీర్ పేట్ పోలీసులు.. పల్లె నితీష్ గౌడ్, కిరణ్ గౌడ్,సంతోష్ యాదవ్,పవన్‌లను నిందితులుగా నిర్ధారించారు...
రోగిపై డాక్టర్ దాడి
ప్రాణం కాపాడే వైద్యులను ప్రజలు దేవుడిగా పరిగణిస్తుంటారు. ఆ వృత్తిలో ఉన్న వారిని ఎంతో గౌరవిస్తారు. అయితే ఆ వృత్తికి ఓ డాక్టర్ మచ్చ తీసుకొచ్చాడు. యూపీలోని సైఫాయ్ మెడికల్ కాలేజ్ యూనివర్శిటీలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. మంచంపై ఉన్న పేషెంట్పై రెసిడెంట్ డాక్టర్ దాడి చేశాడు. చెంపదెబ్బ కొట్టి, దుర్భాషలాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డాక్టర్ తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు. సమాజంలో ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఆశ్చర్యంగా ఉంది.ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రతి ఒక్క రోగికిగుడిలో ఉన్న దేవుడు కన్నా ఎక్కువ విలువిస్తున్న డాక్టర్ వృత్తినిఇలా ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి వాళ్లు ఎక్కడో ఒక చోట ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూసి అందరినీ ఒకేలాగా ఊహించుకోవద్దండి. ఇంతకన్నా గొప్ప వ్యక్తులు గొప్ప డాక్టర్లు చాలామంది ఉన్నారు అందరికీ హాట్సాఫ్
క్షుద్రపూజల కలకలం
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామం సమీపంలో "రాజుల కోట " అనే నిర్మానుష్య ప్రాంతంలో క్షుద్ర పూజల కలకలం. అమావాస్య ఘడియల్లో ఆ ప్రాంతంలో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు, నిమ్మ కాయలు, మద్యం సీసాలు, గుంత తొవ్వి పూడ్చిన ఆనవాళ్ళు కనిపించడంతో స్థానిక గ్రామస్తుల్లో ఆందోళణ, పోలీసులకు ఫిర్యాదు. రెవిన్యూ, పోలీసు, గ్రామస్తుల సమక్షంలో అదే ప్రాంతంలో కొనసాగుతున్న విచారణ.
0 Comments