జివో 33విడుదల
మద్యం దుకాణాలలో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి.
-----------------------------
(ఎన్పిఆర్డీ జనగామ జిల్లా ప్రధానకార్యదర్శి బిట్ల గణేష్.)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు రిజర్వేషన్ అమలు చేయాలని జీవో నెంబర్ 33 విడుదల చేయడం పట్ల వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డీ) జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి బిట్ల గణేష్ హర్షం వ్యక్తం చేశారు.
దివి: 02-08-2023 బుధవారం రోజున జనగామ పట్టణంలోని జిల్లా ప్రజాసంఘాల కార్యాలయం నుండి ఎన్పిఆర్డీ జనగామ జిల్లా ప్రధానకార్యదర్శి బిట్ల గణేష్ పత్రిక ప్రకటన ప్రచురణార్ధం మాట్లాడుతూ జీవో 33 ప్రకారం గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు 5శాతం రిజర్వేషన్ కల్పించడం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ విడుదల చేసిన జీవో నెంబర్ 25 లో వికలాంగులకు ఎలాంటి రిజర్వేషన్స్ ప్రకటించలేదు. ఈ జీవోను సవరించి గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు5శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. మంత్రిగారు ఆరోజు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 25 కు అమెండ్మెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ 33 ను జారీ చేయడం జరిగింది. జీవో 33 ప్రకారం లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు 5% కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. జీవో పేర్కొన్న విధంగా లబ్ధిదారులు ఎంపికలో 5శాతం వికలాంగులకు కేటాయించే విధంగా జిల్లా కలెక్టర్లు, అధికారులు చర్యలు తీసుకోవాలని లేనియెడల ఉద్యమం చేస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డీ) జనగామ జిల్లా కమిటీ హెచ్చరిస్తుందన్నారు. 2016 చట్టం ప్రకారం అన్ని రంగాలలో వికలాంగులకు 5శాతం కేటాయింపులు ఇవ్వాల్సి ఉన్న వికలాంగుల పట్ల నిర్లక్ష్య భావన వీడడం లేదన్నారు. ఎస్, ఎస్టీ లకు తూచ తప్పకుండ రిజర్వేషన్లు పాటించే పాలకులు, వికలాంగుల రిజర్వేషన్ పట్ల లేకపోవడం బాధాకరమని అన్నారు. చట్టాలను పాలకులే గౌరవించకపోతే ఇక ఆ చట్టాలు ఎందుకని ప్రశ్నించారు. వికలాంగులు స్వహక్తితో ఆర్థికంగా ఎదగాలి అని తపన ఉన్న పాలకుల ప్రోత్సాహం కరువయిందన్నారు. తక్షణమే ప్రభుత్వం ప్రకటించే మద్యం దుకాణాల టెండర్లలో వికలాంగులకు 5% శాతం కేటాయిస్తూ ఉత్తర్వులను సవరించి వికలాంగులకు అవకాశం కల్పించాలని కోరారు.
Read More :
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు లింగాల గణపురం మండలంలో సిపిఎం నిరసన కార్యక్రమం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడుదాం సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోక్
ప్రభుత్వ స్కీంలా? బీఆర్ఎస్ పథకాలా??
Read More:
0 Comments