OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

నేడే ఢిల్లీ బిల్లు, ప్రతిపక్షాలు "సై"- సీఎం జగన్ పైనే బీజేపీ ఆశలు..!!

న్యూఢిల్లీ..

పార్లమెంట్ లో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. కేంద్రం కీలక బిల్లులను సోమవారం సభ ముందుకు తీసుకొస్తోంది. అందులో ఉద్యోగులపై ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అధికారాలను తగ్గిస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టనుంది..

కీలక బిల్లు ప్రతిపాదన:మణిపూర్ అంశం పైన నిరసనలతో హోరెత్తుతున్న పార్లమెంట్ లో ఈ రోజు మరింత ఆసక్తి కర అంశాలు తెర మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాతే ప్రతిపక్షాలుప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే తేదీని స్పీకర్‌ ఓం బిర్లానిర్ణయించనున్నారు. ఈ తీర్మానం కూడా ఈవారంలోనే చర్చకు రావచ్చని తెలుస్తోంది. లోక్‌సభలో ప్రభుత్వానికి మెజారిటీ ఉండడంతో ఢిల్లీ బిల్లు ఆమోదం పొందడం సులభమే. రాజ్యసభలో మాత్రం కొంత కష్టపడాల్సి ఉంటుంది. రాజ్యసభ పూర్తి సంఖ్యాబలం 243 కాగా కొన్ని ఖాళీలు ఉం
డడంతో 238 మంది సభ్యులు మాత్రమే ప్రస్తుతం ఉన్నారు..

వైసీపీ మద్దతు కీలకం:రాజ్యసభలో బీజేపీకి 92 మంది సభ్యులు ఉండగా, ఎన్డీఏ కూటమి పక్షాన 105 మంది ఉన్నారు. అయిదుగురు నామినేటెడ్‌ సభ్యులు, ఇద్దరు స్వతంత్ర సభ్యుల మద్దతు తమకే ఉంటుందని బీజేపీ చెబుతోంది. బీఆర్‌ఎస్‌ ఈ బిల్లును వ్యతిరేకించినా ప్రతిపక్షాల సంఖ్యాబలం 108కు మించదని, అందువల్ల ఆమోదంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని రాజ్యసభ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తాజా లెక్కల మేరకు 112 మంది సభ్యుల మద్దతు ఉన్నట్టు తేలుతున్నా బిల్లు ఆమోదం పొందడానికి సరిపోదు. అందువల్ల వైసీపీకి చెందిన 9 మంది సభ్యులు, బీజేడీకి చెందిన 9 మంది సభ్యులపై ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. ఈ రెండు పార్టీల్లో వైసీపీ ఇప్పటికే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది, బీజేడీ మాత్రం తన వైఖరిని స్పష్టం చేయలేదు. బిజేడీ పరోక్షంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు.


సమావేశాల పై ఉత్కంఠ:వైసీపీ, బీజేడీ మద్దతుతో ఢిల్లీ బిల్లు తప్పక ఆమోదం పొందుతుందన్న విశ్వాసంతో మోదీ ప్రభుత్వం ఉన్నది. ఈ బిల్లు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని 90 ఏళ్ల వయస్సున్న మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా వీల్‌ చైర్‌ లో సభకు రానున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందే సమయంలోనే అవిశ్వాసం పైన చర్చకు స్పీకర్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈ బిల్లును అడ్డుకోవాలని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్ణయించారు. అవిశ్వాసం పైన ఈ నెల 2న లోక్ సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు ఒక్కో సభ్యుడు ఉన్న టీడీపీ, బీఎస్పీ, జేడీఎస్ మద్దతు కూడా తమకే దక్కుతుందని బీజేపీ అంచనా వేస్తోంది..

Post a Comment

0 Comments