OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

హోంగార్డు నౌక రా?


తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డుల బతుకు అధ్వానంగా మారింది. వీరికి జీతాలిచ్చేది సర్కారైతే.. పనులు చేయించుకునేది మాత్రం పోలీసు ఉన్నతాధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లు. ఇళ్లలో పాచీ పనులు మొదలు సర్వం వీరితోనే చేయించుకుంటూ భోగాన్ని అనుభవిస్తున్నారు. ఇంట్లో కొన్ని పనులు చేయలేమంటే ఉద్యోగాలు ఊడగొడతామని బెదిరించి మరీ నౌకర్లుగా మార్చేస్తున్నారు. ఈ దాష్టికానికి కారణం తమ ఉద్యోగాలు పర్మినెంట్​కాకపోవడమే అని, తమలోనూ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్​చేసిన వాళ్లు ఉన్నారని చెబుతూ హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు వందలకు పైగా పోలీస్​స్టేషన్లు ఉండగా వాటిల్లో పని చేస్తున్న హోంగార్డుల సంఖ్య 18వేల వరకు ఉంది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్​కమిషనరేట్ల పరిధుల్లోనే దాదాపు ఎనిమిదిన్నర వేల మంది హోంగార్డులు పని చేస్తున్నారు. వీరిలో పోలీస్​స్టేషన్లలో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం నెలకు రూ.28500, ట్రాఫిక్​విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న వారికి రూ.35500 గౌరవ వేతనాన్ని ఇస్తున్నది. నిబంధనల ప్రకారం వీరిని శాంతిభద్రతల పరిరక్షణకు, ట్రాఫిక్​సేవలకు మాత్రమే ఉపయోగించుకోవాలి. కానీ, చాలామంది ఐపీఎస్​అధికారులు హోంగార్డులతో తమ ఇళ్లల్లో పని చేయించుకుంటున్నారు. కనీసం ఇద్దరిని డ్రైవర్లుగా పెట్టుకుంటున్నారు. ఇక, ఇంటి పని, మార్కెట్‌కు వెళ్లి సరుకులు తేవటం కోసం షిప్టుల వారీగా మరో ఇద్దరిని ఉపయోగించుకుంటున్నారు. ఇల్లు, వంటపనికి, దుస్తులు ఉతకటానికి, అంట్లు తోమటానికి మరో ఇద్దరు మహిళా హోంగార్డులను పెట్టుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే రికార్డుల్లో పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్‌లో డ్యూటీలు వేస్తున్నట్టు రికార్డుల్లో రాసి ఇళ్లల్లో పనిచేయించుకుంటున్నారు. ఒక్కో అధికారి ఇంట్లో ఆరు నుంచి పదిమంది హోంగార్డులు పనిచేస్తున్నట్టు ఓ ఐపీఎస్ అధికారి ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్న హోంగార్డు తెలిపారు. రిటైర్డ్​అధికారుల ఇళ్లల్లోనూ చాకిరీ చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్‌లో ఉండే ఓ రిటైర్డ్​అధికారి ఇంట్లో పదహారు మంది హోంగార్డులు పని చేస్తున్నట్టు చెప్పారు. పదిమంది ఓ అధికారి ఇంట్లో పని చేస్తున్నారంటే ప్రభుత్వం ఇస్తున్న వేతనం రూ.2లక్షల 85 వేలు వృథా అవుతున్నట్టే కదా! అని అన్నారు.

బెదిరింపులతో అన్ని పనులు

అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఉద్యోగాలు ఊడగొడతామని బెదిరిస్తూ ఏ పనిబడితే ఆ పని చెబుతుంటారని పలువురు హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిన్న ప్లేట్లను సైతం తీయిస్తారని, కొందరు బాత్రూంలు కూడా కడిగిస్తారని చెబుతున్నారు. తమ ఉద్యోగాలు అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నందున వాళ్లు ఏం చెప్పినా నోరు మూసుకుని చేయాల్సి వస్తోందని బాధపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి హోంగార్డులతో అధికారులు ఇళ్లల్లో పని చేయించుకోకుండా స్పష్టమైన మార్గదర్శకాలను ఏర్పరచాలని కోరుతున్నారు.

Read More :











Post a Comment

0 Comments