సోమవారం నాడు న్యూఢిల్లీలోని కా
న్స్టిట్యూషన్ క్లబ్ లో అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యం 'జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చేనేత డిక్లరేషన్ రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతంగా ముగిసింది. అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో చేనేతపై విధించిన జీఎస్టీ పన్నును తొలగించాలని దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న ఉద్యమానికి కొనసాగింపుగా ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం రోజున మధ్యాహ్నం మూడు గంటలకి కాన్స్టిట్యూషన్ క్లబ్ లో చేనేత డిక్లరేషన్ పై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఐదు శాతం జీఎస్టీని ఎత్తి వేయాలని కోరడంతో పాటుచేనేత రంగం ఎదుర్కొంటున్న ఇతర సమస్యల గురించి వక్తలు చర్చించారు. ఈ కాన్ఫరెన్సు కు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు శశి థరూర్, కార్తీ చిదంబరం, వివేక్ తన్ఖా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బిజూ జనతా దళ్ ఎంపీ అమర్ పట్నాయక్, బిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు, పముఖ పాత్రికేయులు ఎస్ వెంకట్ నారాయణ హజరయ్యారు.
చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై
1. చేనేత దుస్తులపై జిఎస్టి రద్దు చేయాలి
2. చేనేత కులాలకు జనాభా దామాషా పద్దతిలో రాజకీయ రాజకీయం ప్రకటించాలి
3. చేనేత కార్మికుల సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలను పునరుద్ధరించాలి
4. చేనేతకారులకు సహకార సంఘాలకు రుణమాఫీ చేయాలి
5. చేనేతకారులకు జనాభా నిష్పత్తికి అనుగుణంగా బడ్జెట్ కేటాయించాలి
6. చేనేత కారుల అభివృద్ధి కోసం జాతీయ చేనేత విధానాన్ని ప్రకటించాలి అని కోరుతూ ప్రకటించిన
డిక్లరేషన్కు వక్తలందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.
అంతకు మందు ఈ రోజున ఉదయం 8 గంటలకి అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో ఎర్రకోట నుండి రాజ్ ఘాట్ వరకు హ్యాండ్లూమ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న నేత, యువజన విభాగం ఇన్చార్జ్ అవ్వారి భాస్కర్, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాధం, మహిళా విభాగం అధ్యక్షురాలు వనం దుష్యంతల, సినీ నటి, సామాజిక కార్యకర్త పూనమ్ కౌర్, బాల్కొండ మాజీ ఎంఎల్ఎ ఇరవర్తి అనిల్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు. సంగిశెట్టి జనార్ధన్ వారితో పాటు దాదాపు 14 రాష్ట్రాల నుంచి పద్మశాలి సంఘాల నేతలు, చేనేత కార్మికులు హాజరయ్యారు.
Read More:

0 Comments