హైదరాబాద్
కొండాపూర్ లోని కె ఎల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ లో నూతనంగా నిర్మించిన సెమినార్ హాల్ ను రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ బుధవారం ప్రారంభించారు. కె ఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ , విజయవాడ క్యాంపస్ లలో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించిన కె ఎల్ మ్యాట్ ప్రవేశ పరీక్షా ఫలితాలను, అడ్మిషన్స్ కౌన్సిలింగ్ షెడ్యూల్స్ కూడా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గ్లోబల్ బిజినెస్ స్కూల్ లో మౌళిక సౌకర్యాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉన్నాయని, తరగతి గదులు, గ్రంథాలయం, పరిశోధన కేంద్రాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంశించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో దళిత గిరిజన విద్యార్థులు సమాజంలో నిలదొక్కుకునే విధంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నారని తెలిపారు. కే యూనివర్సిటీ గిరిజన విద్యార్థులకు స్కాలర్షిప్ అవకాశం కల్పించడం అభినందనీయం అన్నారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులకు కే ఎల్ యూనివర్సిటీ మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రపంచ స్థాయి విద్య అందించటంలో హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఉన్నత విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి సాధిస్తున్నారని, సాంకేతిక విద్యా ఉద్యోగ రంగాల్లో మహిళలు చాలా చురుగ్గా ఉండటం విశేష పరిణామమని కొనియాడారు. మారుతున్న కాలానికి, పోటీ ప్రపంచానికి ధీటుగా నేటి యువత రూపొందుతున్నారని అన్నారు. కె ఎల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ద్వారా అందిస్తున్న మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, ప్రత్యేకతలను ఈ సందర్భంగా మంత్రి ప్రశంశించారు.
ఈ కార్యక్రమంలో కె ఎల్ యూనివర్సిటీ వీసీ పార్థసారథి, ప్రిన్సిపల్ కోటేశ్వరరావు, డైరెక్టర్ రామకృష్ణ స్థానిక కార్పొరేటర్ విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
Read More :
.jpeg)
0 Comments