
Don't make your children mentally weak.. - Periyar Ramaswamy
" మీ చెప్పు చేతల్లో పిల్లల్ని పెంచాలని, మీ మూర్ఖపు, మూఢాచారపు భావాల్ని వారికి అంటగట్టకండి !
దేవుడు వున్నాడని గుళ్ళూ, గోపురాలు తిప్పించి, వారిచే దండాలు, పూజలు చేయించకండి!!
పిల్లల చదువు కోసం మీరు ఎంతైనా కష్టపడండి, అంతేగానీ అన్ని కష్టాల్ని ఆ కనిపించని దేవుడే తీర్చేస్తాడని, పిల్లలకి లేనిపోని భ్రమలు మాత్రం కల్పించి చెప్పకండి !!!
దేవుడే వున్నాడని మీరు గాఢంగా నమ్మిస్తే, మీ పిల్లల్లో స్వంత వ్యక్తిత్వ వికాసం గానీ, స్వంత ఆలోచనా విధానం గానీ వుండదు అన్నిటికీ ఆ దేవుడు మీదే భారం వేసే బలహీనులై పోతారు !!!!
పిల్లల్లో మేధావితనం పెరగాలి గానీ, భక్తి భావన పెరిగినా ప్రయోజనం లేదు.
నిజానికి ---దేవుడు వున్నాడా లేదా అని నిర్ణయించుకో వలసింది మీ పిల్లలే, ఉన్నాడు అనే ఓ అబద్దమైన నమ్మకాన్ని మాత్రం మీరు కలిగించకండి!
అప్పుడే మీ పిల్లలకు మీరు మేలు చేసినవారౌతారు !!
0 Comments