.jpg)
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకంలో ఒక్క ఇల్లు కూడా ల్యాప్స్ కాకూడదని స్పష్టం చేశారు.
.jpg)
జనగామ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ **రిజ్వాన్ భాషా షేక్**తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సాగు నీటి అంశాలపై సమగ్ర చర్చ జరిగింది.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ:
-
ఇప్పటికే పనులు ప్రారంభించని లబ్ధిదారులు వెంటనే నిర్మాణం ప్రారంభించేలా ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలి.
-
వారం రోజుల్లో పనులు ప్రారంభించకపోతే రద్దు చేసే చర్యలు తీసుకోవాలని సూచించారు.
-
ప్రతి మండలంలో మార్క్ అవుట్ పూర్తయిన, ఇంకా ప్రారంభం కాని ఇళ్ల వివరాలు సేకరించి సమీక్షించాలని ఆదేశించారు.
-
ఏప్రిల్‌లో రెండో విడతగా మరో 3,500 ఇళ్ల మంజూరు అవకాశం ఉందని తెలిపారు.
మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి మాత్రమే ఇళ్లు మంజూరు కాగా, రెండో విడతలో స్థలం లేని పేదలకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ స్థలాల గుర్తింపు – మార్చి 15న కీలక సమీక్ష
తహసీల్దార్లు మండలాల వారీగా ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి:
-
ఒక్క ఎకరంలో ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వవచ్చో ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
-
నిబంధనల ప్రకారం లే అవుట్ ప్లాన్ రూపొందించాలి
-
మార్చి 15న ఆర్డీవోలు, తహసీల్దార్లతో జరిగే సమీక్షకు పూర్తి వివరాలతో హాజరు కావాలి
సాగు నీరు: ఒక్క ఎకరం కూడా ఎండిపోకూడదు
సాగు నీటి విషయంలో కూడా ఎమ్మెల్యే కఠిన హెచ్చరికలు జారీ చేశారు:
-
సాగు నీరు అందక ఒక్క ఎకరం కూడా ఎండిపోవడానికి వీలు లేదన్నారు.
-
గోదావరిలో సరిపడా నీరు ఉన్నందున మార్చి చివరి వరకు లిఫ్టింగ్ కొనసాగించాలని సూచించారు.
-
రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
-
బొమ్మకూరు కాలువలో పూడికతీత, చెట్ల తొలగింపు పనులు వారం రోజుల్లో పూర్తి చేసి మంగలి బండ తండా వరకు నీరు అందించాలని చెప్పారు.
-
జఫర్‌గడ్ మండలం హిమ్మత్‌నగర్ వరకు నీరు చేరేలా ఎస్‌డిఎఫ్ నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తామని వెల్లడించారు.
ఈజీఎస్ నిధుల వినియోగంలో నిర్లక్ష్యం వద్దు
ఈజీఎస్ నిధుల వినియోగంలో అధికారులు అలసత్వం వహించరాదని హెచ్చరించారు. మార్చి 21లోపు పనులు పూర్తి చేసి బిల్లులు పంపితేనే కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు సాధ్యమవుతాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం మనందరి బాధ్యత అని అన్నారు.
కలెక్టర్‌లకు సత్కారం
ఈ సమావేశంలో ఆర్డీవోలు, డిఆర్‌డిఎ పిడిలు, హౌసింగ్, నీటిపారుదల శాఖ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
.jpg)

0 Comments