OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

రాష్ట్రంలో ఒక్క పనైనా చేశారా? పల్లా రాజేశ్వర్ రెడ్డి

Palla-Rajeshwar-Reddy-with-jevan-reddy

Palla Rajeshwar Reddy

-రెండున్నరెళ్లలో 2½ లక్షల కోట్ల అప్పులు చేశారు..
-రేవంత్ ప్రభుత్వంపై మళ్లీ పల్లా ఫైర్…!
-బడ్జెట్, అప్పులపై ఘాటు విమర్శలతో దుమ్మురేపిన జనగామ ఎమ్మెల్యే
-అభివృద్ధి ఎక్కడ కనబడటం లేదు..అప్పులు ఎందుకు?అయ్యా యంటూ కాంగ్రెస్‌ను నిలదీత
-బడ్జెట్ పెరగదు…అప్పులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి!
-బీఆర్‌ఎస్ హయాంలో 4½ లక్షల కోట్లతో బ్రహ్మండమైన అభివృద్ధి జరిగింది..
-అసమర్థ సీఎం ఈ రాష్ట్రానికి దొరకడం దురదృష్టం..
-రేవంత్ పోవాలి… కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో ఊపందుకుంటోంది.
-20న జరిగే జగిత్యాల జైత్యయాత్రకు భారీ సంఖ్యలో తరలిరావాలి..
–జగిత్యాల ప్రజలకు జనగామ ఎమ్మెల్యే పల్లా గారు విజ్ఞప్తి..
జగిత్యాల:
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోసారి రేవంత్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. ఈ నెల 20న జగిత్యాలలో జరగ నున్న కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటులో భాగంగా జగిత్యాల పట్టణ కేంద్రంలో శనివారం నిర్వహించిన కార్యకర్తలు, నాయకుల సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదు. ఎక్కడ చూసినా అప్పులే పెరుగుతున్నాయని మండిపడ్డారు. బడ్జెట్ పెరగకపో యినా అప్పులు మాత్రం విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే 2½ లక్షల కోట్లకు పైగా అప్పు లు చేసిన ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో 4½ లక్షల కోట్లతో భారీ అభివృద్ధి జరిగిందని గుర్తుచే సారు. ఇప్పుడు ఆ స్థాయి పనులు ఎక్కడా కనిపించడం లేదన్నారు. సెక్రటేరియట్, అంబే ద్కర్ విగ్రహం వంటి ప్రతిష్టాత్మక నిర్మాణాలు అప్పట్లో జరిగాయి. ప్రస్తుతం ప్రభుత్వం అలాంటి దూరదృష్టి లేకుండా వ్యవహరిస్తోందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి అసమర్థ నాయకత్వం దొరికిందని వ్యాఖ్యానించారు. రేవంత్ పోవాలి…కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు. జగిత్యాల జైత్య యాత్రకు భారీ సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
జనగామ ఎమ్మెల్యే పల్లా గారి పాయింట్స్:
👉జగిత్యాల అనేది 2014కు ముందు ఎలా ఉండేది..2014 తర్వాత ఎలా మారింది అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.
👉2014 తర్వాత పట్టణ అభివృద్ధి కావొచ్చు..జగిత్యాల నియోజకవ ర్గానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు కావొచ్చు ఇవన్నీ ప్రజల కళ్ల ముందే ఉన్నాయి.
👉నీళ్ల సమస్యతో కేసీఆర్ వద్దకు వెళ్తే వెంటనే పరిష్కారం కోసం కృషి చేసేవారు. చెరువులు, చెక్‌డ్యామ్‌లు వంటి చిన్న చిన్న పనులను కూడా వెంటనే ఆమోదించి పూర్తి చేసేవారు. అన్ని నియోజకవర్గాలకు సమా నంగా అభివృద్ధి అందించారు. జగిత్యాల నియోజకవర్గంలో సాగునీరు, పట్టణ అభివృద్ధి ఇవన్నీ మీ కళ్ల ముందే ఉన్నాయి. అందరూ ఒకసారి ఆలోచించండి.
👉రోడ్లు కావొచ్చు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కావొచ్చు, సెంట్రల్ లైటింగ్ కావొచ్చు..ఇవన్నీ ఒక ఎత్తు.. కానీ లోకల్ బాడీ ఎన్నికలు వేరు. ఏ ప్రభు త్వం అధికారంలో ఉంటే దానిని గెలిపించాలని ప్రజలు భావిస్తారు.
👉మనం ఉన్న రోజుల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో దాదాపు 134 స్థానాల్లో గెలిచాం. ప్రజలు చైతన్యవంతులు..10ఎన్నికలు వచ్చి నా ఎవరిని ఎన్నుకోవాలో వారినే ఎన్నుకుంటారు.
👉2014లో తెలంగాణను సాధించిన కేసీఆర్ కు , 2018లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసినందుకు ప్రజలు మళ్లీ పట్టం కట్టారు.
👉2023లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కేసీఆర్ కంటే ఎక్కువగా ఉన్నా యని భావించి ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు. కానీ మానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఏమైనా అమలు అయ్యాయా అని జగిత్యాల ప్రజలు ఆలోచించాలి.
👉2014, 2018లో కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు అయ్యాయా లేదా? 2023లో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు అయ్యాయా లేదా అన్నది ప్రజలు గ్రహించాలి.
👉2014లో రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2023 నాటికి ఎంత పెరిగింది? 20 23 తర్వాత ఎందుకు బడ్జెట్ పెరగడం లేదు? ఎందుకు అప్పులు పెరుగుతున్నాయి?
👉దాదాపు 9½ ఏళ్లలో సుమారు 4 లక్షల కోట్ల అప్పులు చేసినా, దేశం లోనే తక్కువ అప్పులు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఆ అప్పులను ప్రాజెక్టులు, కలెక్టర్ కార్యాలయాలు, రోడ్ల నిర్మాణం వంటి కాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం వినియోగించారు.
👉కానీ కేవలం 2½ ఏళ్లలోనే 2½ లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఎక్కడ ఖర్చు పెట్టిందో ప్రజలు ప్రశ్నించాలి. ఒక్క నిర్మాణం చేశారా? ఒక్క ఇటుక అయినా పెట్టారా? ఒక్క ప్రాజెక్ట్ ప్రారంభించారా? ఉన్న ప్రాజెక్టులను అయినా కొనసాగిస్తున్నారా?
👉ఆనాడు 4½ లక్షల కోట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే, ఇప్పుడు 2½ లక్షల కోట్లతో ఒక్క అభివృద్ధి పనైనా చెప్పగలరా? సెక్రటేరియట్ కట్టారా? అంబేద్కర్ విగ్రహం నిర్మించారా? పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారా? మెడికల్ కాలేజీలు కట్టారా? డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టారా? ఏమి చేయకుండా, బడ్జెట్ పెంచకుండా ఉన్న బడ్జెట్‌ను దేనికి వినియోగిస్తున్నారు?
👉ఒక అసమర్థ పాలకుడు దురదృష్టవశాత్తూ ఈ రోజు రాష్ట్రానికి సీఎం అయ్యాడు. దానికి తోడు అసమర్థ ఎమ్మెల్యే ఉండటం మరింత దురదృష్టకరం.
👉జీవన్ అన్నకు రాష్ట్రంలోని అన్ని సమస్యలపై అవగాహన ఉంది. నాలుగు దశాబ్దాల స్వచ్ఛమైన రాజకీయ చరిత్ర ఆయనది. ఆయన ప్రభుత్వం లో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఒకే విధంగా పనిచేస్తారు. తన పనితీరుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి కారణమయ్యారు. కానీ కార్యకర్తలకు ఫలితాలు రాకపోవడం, ప్రజలకు పథకాలు అందకపో వడం, పార్టీ విధానాలు నచ్చకపోవడంతో చాలా మంది ఆయనతో కలిసి వచ్చారు.
👉తెలంగాణ ప్రజలందరిలో ఒక అసమర్థ పాలకుడు దొరికాడనే భావ న పెరుగుతోంది. రేవంత్ పోవాలి… కేసీఆర్ రావాలి… అనే నినాదంతో ప్రజలు ముందుకు వస్తున్నారు.
👉జగిత్యాల స్ఫూర్తిగా రేపు మార్పు తీసుకురావడానికి ప్రజలు సిద్ధం గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ రావడానికి జగిత్యాల ప్రధాన భూమిక పోషిస్తుంది.

Post a Comment

0 Comments