పంతం సాయి ప్రసాద్ డివైఎఫ్ఐ జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్...
జనగామ :- జనగామ పట్టణంలో ఏకశిలా గడ్డకు జాతీయ రహదారి 365 బిలో ప్లాట్లు కోల్పోతున్న ఫ్లాట్ల యజమానులకు ముందుగా నష్టపరిహారం ఇచ్చినంకనే జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని డివైఎఫ్ఐ జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పంతం సాయి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు....
ప్లాట్లు కోల్పోతున్న బాధిత ఫ్లాట్ యజమానులు చేపడుతున్న రిలే దీక్షలు నేటికి ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి.ఈదీక్షలకు డివైఎఫ్ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పంతం సాయి ప్రసాద్ మద్దతు తెలిపి మాట్లాడుతూ కాయ కష్టం చేసుకిని పేదలు రైతులు చిన్న వ్యాపారులు వారి భవిష్యత్ అవసరాల కోసం పిల్లల కోసమని జనగామ పట్టణంలో ప్లాటు కొనుక్కున్నారు.భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని కొనుక్కుంటే ఇయాల జాతీయ రహదారి పేరుతో వారికి షరాగాతకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.వారికి నష్టపరిహారం ఇవ్వకుండా చిన్నచిన్న కారణాలు చెప్పి అధికారులు ఇబ్బందులు పెట్టడం సరైంది కాదని అన్నారు.2013 భూ సేకరణ చట్టం నిబంధనల ప్రకారం నడుచుకోవాలని వారు సూచించారు.ఈచట్టంలో భూమి కోల్పోతున్న బాధితులకు పునరావాసం కూడా కల్పించాలని ఉన్నదని భూమికి బదులు భూమి కూడా ఇవ్వాలని ఉన్నదని మెరుగైన నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కూడా ఉన్నదని ఆభూమీయే వారికి జీవనాధారం అయితే ఉపాధి కూడా కల్పించాలని ఆ చట్టంలో ఉన్నదని ఆచట్టంలో ఉన్న ఏనిబంధనలను పాటిస్తున్నారు.అని అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైనా జాతీయ రహదారిలో భూమి కోల్పోతున్న ప్లాటు యజమానుల సమస్యను మానవీయ కోణంలో ఆలోచించే పరిష్కరించాలని డిమాండ్ చేశారు...
ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి తీగుళ్ల రెడ్డి వేలంగిని జిట్టా నరసింహులు బజ్జురి అశోక్ ఉప్పరి విజయ్ తుడి సుదర్శన్ సుధాకర్ పరమేశ్వరి నల్ల యాదగిరి పన్నీరు జగన్మోహన్ రేణుక కొండ యాదగిరి తీగుల్లా ఆండాలు తదితరులు పాల్గొన్నారు
%20works%20should%20be%20undertaken%20only%20after%20paying%20compensation..jpeg)
0 Comments