సీనియర్ నాయకులు, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా మత్స్య శాఖ ,కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నే రాజు గారు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.గౌ|| ఎనుముల రేవంత్ రెడ్డి గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పట్ల వారికీ ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి మరియు టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి గార్ల ఆధ్వర్యంలో, గౌరవనీయులు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మరియి డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రశ్ యాదవ్ గార్ల సమక్షంలో ఆయనకు పార్టీ కండువా వేసి ఘనంగా ఆహ్వానించారు.
ఈ పరిణామం కుత్బుల్లాపూర్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ కార్యక్రమం లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంధాలయం చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, కే .ఏం గౌరీష్, లక్ష్మ రెడ్డి, రషీద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బట్ట పాల కృష్ణ, సిద్దనోల సంజీవరెడ్డి , మైసిగారి శ్రీనివాస్, బైరీ ప్రశాంత్ గౌడ్, ఆలేటి శ్రీనివాస్ రావు, ముత్యం రెడ్డి పాల్గొన్నారు.

.jpeg)
0 Comments