మహబూబాబాద్ జిల్లా ప్రజలకు గొప్ప శుభవార్త అందింది. తొలిసారిగా మానుకోట (మహబూబాబాద్) రైల్వే స్టేషన్‌లో Amrit Bharat Express ఆగబోతోంది. దీంతో జిల్లాకు నేరుగా దీర్ఘదూర ప్రయాణ సౌకర్యం లభించనుంది.
ప్రస్తుతం చర్లపల్లి నుంచి షాలిమార్ వరకు నడుస్తున్న 07225/07226 స్పెషల్ రైలును ఇకపై అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తూ 17065/17066 నంబర్లతో నడపనున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన కోచ్‌లు, ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
మార్గం ఇలా ఉంటుంది
చర్లపల్లి నుంచి బయలుదేరే ఈ రైలు
-
కాజీపేట
-
వరంగల్
-
మహబూబాబాద్
-
ఖమ్మం
-
రాయనపాడు
మార్గంగా వెళ్లి చివరకు Shalimar railway station చేరుకుంటుంది.
ఈ రైలు ప్రారంభ తేదీ, ఖచ్చితమైన టైమింగ్స్‌ను త్వరలోనే రైల్వే శాఖ ప్రకటించనుంది.
జిల్లా ప్రజల్లో ఆనందం
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రాకతో మహబూబాబాద్ జిల్లాకు కొత్త రైల్వే రూపం దక్కనుంది. దీర్ఘదూర ప్రయాణాలు సులభమవడంతో పాటు, వ్యాపారం, ఉద్యోగ, విద్యావకాశాలకు కూడా ఈ రైలు ఉపయోగపడనుంది.
ఇక మహబూబాబాద్‌లో ఆధునిక సదుపాయాలతో కొత్త రూపంలో రైలు దర్శనం ఇవ్వనుంది.

0 Comments