కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం గేర్రె గ్రామంలో తన కుమారుడు గిరిజన యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడని కోడలు 9 నెలల నిండు గర్భావతి తలండి శ్రావణి రాణిని అత్యంత క్రూరంగా హత్య గావించిన శివార్ల సత్తయ్యను కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు ఆదివారం చిక్కడపల్లి కెవిపిఎస్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం కురుమయ్య అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ తలండి శ్రావణి రాణి ఎదురు ఇంట్లో ఉంటున్న శివార్ల శేఖర్ ను ఏడాది క్రితం కులాంతర వివాహం చేసుకుంది తన కుమారుడు శేఖర్ శ్రావణి రాణిని వదిలేసి రావాలని ఆమె ఒక గిరిజన మహిళా కులం తక్కువ మహిళ కాబట్టి తక్షణమే వదిలేయాలని పలుమార్లు నా కొడుకును బెదిరించాడు అయినా ప్పటికీ శేఖర్ శ్రావణి రాణితోటే ఉంటూ ఆమె తల్లి గారిఇంట్లోనే నివాసం ఉంటున్నారు శ్రావణి రాణి కుటుంబ సభ్యులు లేని సమయంలో చూసిన శేఖర్ తండ్రి సత్తయ్య అత్యంత క్రూరంగా గొడ్డలితో నరికి చంపాడు నిండు గర్భవతి అనే కనీస మానవీయ కోణాన్ని కూడా విస్మరించి హత్యగావించాడు రాష్ట్రంలో కుల దురహంకారహత్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ కులాంతర వివాహితులకు రక్షణ చట్టం చేయడంలో ఘోరంగా విఫలమవుతుందని అన్నారు కుల దురహంకార హత్యలన్ని ప్రభుత్వ హత్యలుగా చూడాలని ఆయన డిమాండ్ చేశారు ఆమెను హత్య చేసిన సత్తయ్య తన కుమారుడు కుమార్ కోడలు కవిత ఈ హత్యలో పాత్రధారులందరిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు కులాంతర వివాహిత రక్షణ చట్టం చేయడం ద్వారా కుల దురహంకారహత్యలను నివారించడానికి ప్రయత్నించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుల దూరహంకారహత్యను ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఖండించాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు.
*ఈ సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర ఆఫీసు బేరర్స్ పాలడుగు నాగార్జున కోట గోపి దుడ్డేల రామ్మూర్తి మంద సంపత్ ప్రకాశ్ కరత్ పల్లేర్ల లలిత దుర్గం దినకర్ జి రాజు డి రాధాకృష్ణ పి పర్శరాములు పి అశోక్ యూ మల్కయ్య తదితరులు పాల్గొన్నారు*
*టి స్కైలాబ్ బాబు*
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కేవీపీఎస్ తెలంగాణ
0 Comments