సీపీఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన కామ్రేడ్ దొడ్డి కొమురయ్య (Doddi Komuraiah) పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను ఉదృతం చేస్తామని సిపిఎం (CPM) జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి పిలుపునిచ్చారు . తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతిని పురస్కరించుకొని సిపిఎం (CPM) ఆధ్వర్యంలో కడవెండి గ్రామంలో దొడ్డి కొమురయ్య స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభకు సిపిఎం(CPM) మండల కార్యదర్శి సింగారపు రమేష్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సీపీఎం (CPM) జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి పాల్గొని మాట్లాడుతూ దొరల అణచివేతకు ఆగడాలకు వ్యతిరేకంగా కౌలులేవి రద్దు చేయాలని కూలిరేట్లు పెంచాలని పేదలకు భూములు పంచాలని దోపిడీ ని నిర్మూలించాలని నాడు సాగిన విరోచత వీర తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో విశ్నుర్ దేశముక్ రాపాక రామచంద్రారెడ్డి ఆగడాలను ఎదిరిస్తూ సాగిన పోరాటంలో విశ్నుర్ దేశముక్ గుండాలు జరిపిన కాల్పులలో ముందు వరుసలో ఉన్న దొడ్డి కొమరయ్య తుపాకీ గుళ్ళకు బలయ్యాడు అన్నారు. కొమరయ్య మరణం తెలంగాణ వ్యాప్తంగా కొలిమేలే మండి ఊరూరా ప్రతిఘటన పోరాటాలు ఉవ్వెత్తున లేచేయన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట రూపం తీసుకుందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4000 మంది రక్త తర్పణం గావించి పది లక్షల ఎకరాల భూములు పంచి పెట్టిన చరిత్ర ఎర్రజెండాది అన్నారు. కానీ నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి (BJP) ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ అప్పనంగా ప్రజల ఆస్తులను దోచిపెడుతుందన్నారు. భారత రాజ్యాంగాన్ని రద్దుచేసి దాని స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని పెద్ద కుట్ర జరుగుతుందన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతుందని ఆకలి దారిద్రం మహిళలపై అత్యాచారాలు కార్మికుల శ్రమ దోపిడీ రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి అన్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండబెట్టడం కోసం ప్రజలకు రక్షణ నిలవడం కోసం ప్రజలు మేధావులు ప్రజాసంఘాలవాదులు దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో సిపిఎం (CPM) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఇర్రి అహల్య జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి జోగు ప్రకాష్ సుంచు విజయేందర్ సిపిఎం సీనియర్ నాయకులు రామావత్ మిత్యనాయక్ నాయక్ సుధాకర్ శ్రీను యాకయ్య రామచంద్రం వెంకన్న వెంకట్ రెడ్డి బిక్షపతి మాధవరెడ్డి తదితరులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.....
0 Comments