వినతి పత్రం ఇస్తున్న గిరిజన సంఘాల నాయకులు
----------------------------------------
జనగామ: జనగామ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలకు కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇంచార్జి ,మాజీ శాసనసభ్యులు డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు సందర్శించి గిరిజన విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గిరిజన సంఘాల ప్రతినిధులు కొమ్మూరి ప్రతాపరెడ్డి గారికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో నర్మేట మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, నిర్మాణానికి ప్రభుత్వ భూమి లేకపోవడంతో స్వయంగా కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు కొట్ల విలువ చేసే ప్రైవేటు భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వానికి డొనేట్ చేసి గిరిజన విద్యార్థినుల కోసం గిరిజనుల భవిష్యత్తు తరాల కోసం బంజారాల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తి అని వారు కొనియాడారు ఈ సందర్భంగా జనగామ మండల పరిధిలోని చెంపకిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను వారు సందర్శించారు ముఖ్యంగా ఈ ఆశ్రమ పాఠశాలలో సుమారు 300 మంది గిరిజన నిరుపేద విద్యార్థులు మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారని కానీ వీరికి సరిపడా తరగతి గదులు వసతి గృహాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, మూడు నాలుగు ఐదో తరగతిలో విద్యార్థులు చెట్ల కింద విద్యను అభ్యసిస్తున్నారని అనేకమార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారులు దృష్టికి గిరిజన సంఘాల ప్రతినిధులుగా వినతి పత్రాల రూపంలో విన్నవించిన ఏమాత్రం పట్టించుకోవడంలేదని అన్నారు కావున తక్షణమే వసతి గృహం ప్రక్కనే సర్వేనెంబర్ 140 లో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నదని అట్టి ప్రభుత్వం భూమీ లో నుండి గిరిజన విద్యార్థుల అవసరాల కోసం ఐదు ఎకరాల స్థలం కేటాయించి పాఠశాలకు భవన నిర్మాణం చేపట్టాలని కోరారు.
ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు మాట్లాడుతూ గతంలో నర్మెట్ట మండల కేంద్రంలో గిరిజన విద్యార్థినుల భవిష్యత్తు కోసం 4 ఎకరాల స్థలం కొనుగోలు చేసి ప్రభుత్వానికి దానం చేయడం మూలంగా వందలాది విద్యార్థుల భవిష్యత్తు మారిందని అనేకమంది వివిధ స్థాయిలలో ఉద్యోగాలలో స్థిరపడ్డారని కాబట్టి ప్రభుత్వ స్థలం ప్రక్కన ఉన్నందున గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలకు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి తక్షణమే గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ మరియు జనగామ జిల్లా కలెక్టర్లతో మాట్లాడి 5 ఎకరాల స్థలం కేటాయింపులు నెల రోజులలో పూర్తయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు గిరిజన సంఘాల నాయకులు మూడ్ లక్ష్మణ్ నాయక్, గుగులోతు లచ్చయ్య నాయక్, భూక్యా చందు నాయక్, రామావత్ మీట్యా నాయక్,
లకవాత్ నరేష్ నాయక్ గిరిజన ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*
#jangaon #telangana #girijanasangam
0 Comments