OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

ఆసరా పింఛన్ దారులకు ముంచుకొస్తున్న ముంపు..... జాగ్రత్త జీవో 17 పింఛన్ దారుల మెడకు ఉరితాడు



జివో 17రద్దు కోసం రాష్ట్ర వ్యాపిత ఉద్యమం





-----------------------------
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పిఆర్డి) జనగామ జిల్లా కార్యదర్శి బిట్ల గణేష్ డిమాండ్.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ దారుల మెడకు ఉరితాడు బిగుస్తుంది, పింఛన్లు పొందుతున్న వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఇతర అన్ని రకాల పింఛన్ల రద్దు కోసం జీవో 17ను తీసుకొచ్చిందని, ఈ జీవో అమలుతో రాష్ట్రంలో ఇప్పటికే 12లక్షల పింఛన్లు తొలగించడం జరిగిందని, తక్షణమే విడుదల చేసిన జీవో నెంబర్ 17ను రద్దు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పిఆర్డి) జనగామ జిల్లా ప్రధానకార్యదర్శి బిట్ల గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  
  
దివి: 20-10-2022 గురువారం రోజున వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డీ) జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సూపరింటెండెంట్ సురేష్ గారికి వికలాంగులు ఎదురుకొంటున్న వివిధ సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా ప్రధానకార్యదర్శి బిట్ల గణేష్ పాల్గొని మాట్లాడుతూ జీ.వో నెంబర్ 23కు అమెండ్మెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2014లో జీ.వో నెంబర్ 17ను విడుదల చేసింది. ఈ జీవో పింఛన్ దారుల మెడకు ఉరితాడవుతుందని తెలిపారు. జీ.వో నెంబర్ 17లో అనేక ప్రమాదకరమైన షరతుల్ని ప్రభుత్వం పేర్కొంది, ఈ షరతుల ద్వారా రాష్ట్రంలో 12 లక్షల ఆసరా పింఛన్లను తొలగించి ఆసరా లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం చేసిందని తెలిపారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా క్రొత్త పింఛన్లు ఇస్తున్నామని ఆర్బాటంగా చెబుతూ గతంలో తొలగించిన 12లక్షల పింఛన్ల నుండి 10లక్షల పింఛన్లను మాత్రమే మంజూరు చేసిందని, ఇంకా 2లక్షల పింఛన్లకు కోతపెట్టిందని విమర్శించారు. ప్రభుత్వ మార్గదర్శకాల వల్ల ఆసరా లబ్ధిదారుల పాలిట శాపంగా మారిందని హెద్దేవా చేశారు. గత నెల 15రోజుల నుండి ఒక జనగామ జిల్లాలో  సుమారు 1000 మంది ఆసరా లబ్ధిదారుల పింఛన్లను ప్రభుత్వం నిలుపుదల చేసిందని అన్నారు. మన జనగామ జిల్లాలోనే ఈవిధమైన పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించుకోవడం కోసం షరతులు పెట్టి ఆసరా పింఛన్లని రద్దు చేయడం సరియైనది కాదని విమర్శించారు. ప్రభుత్వానికి  చేతనైతే బోగస్ పింఛన్లను ఏరి ప్రజాధనం వృధాకాకుండా అరికట్టాలి, కానీ ఇలాంటి షరతులతో పింఛన్ దారులను నమ్మించి మోసం చేయడం దుర్మార్గం అన్నారు. జీవో 17 ప్రకారం గ్రామీణ ప్రాంతంలో లబ్ధిదారుల వార్షిక ఆదాయం లక్ష 50 వేలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఉంటే మాత్రమే పింఛన్లు మంజూరు చేయాలని పేర్కొనడం సరైనది కాదన్నారు. స్వయం ఉపాధి కోసం చిరు వ్యాపారాలు చేసుకునేవారు పింఛన్  కు అర్హులు కాదని జీ.వో 17లో పేర్కొనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు? స్వయం ఉపాధి చేసుకునే వారికీ రాష్ట్ర ప్రభుత్వమే ఫోర్ వీలర్ వాహనాలను ఉచితంగా ఇస్తుంది, లాంటిది వాహనం ఉందనే పేరుతో పింఛన్లు రద్దు చేయాలని జీవో లో పేర్కొనడం సిగ్గుమాలిన నిర్ణయం అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి  కుటుంబ సభ్యులలో ఎవరైనా ఆర్థిక సహాయం (సబ్సిడి ఋణాలు) పొందిన వారందరూ పింఛన్ కు  అనర్హులని ప్రకటించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కుటుంబాలను పోషించుకునేందుకు స్వయం ఉపాధి చేసుకుంటున్న వికలాంగులు కూడా పింఛన్ పొందడానికి అనర్హులని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటని తెలిపారు. ఆసరా పింఛన్ పొందుతున్న లబ్ధిదారుల కుటుంబాల్లో రెండు పంటలు పండే భూమి 3ఎకరాలు, ఒక్క పంట పండే భూమి 7.5 ఎకరాల లోపు ఉంటేనే ఆసరా పింఛన్లకు అర్హులని ప్రభుత్వం నిర్ణయించడం సరైనది కాదన్నారు. 40% వైకల్యం కలిగిన వారందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులని 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం పేర్కొందని, అలాంటి ఎందుకు షరతులు పెడుతున్నారని హెద్దేవా చేశారు. 2016 ఆర్పిడి రూల్స్ ని తుంగలో తొక్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 40% కాకుండా మూగ, చెవిటి వికలాంగులకు 51% వైకల్యం కలిగి ఉంటేనే పింఛన్లు మంజూరు చేయాలని జీవో నెంబర్ 31 విడుదల చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. తక్షణమే జివో 17ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన ఆసరా పింఛన్ల పథకంలో లబ్ధిదారులకు షరతులు పెట్టి పింఛన్లు రద్దు చేయడానికి కుట్రలు చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో 10 లక్షల మందికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేస్తున్నామని గొప్పలు చెప్పి సెప్టెంబర్ నెల మొత్తం గ్రామాల్లో ఆసరా పండుగ పేరుతో పింఛన్ లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేసి ప్రభుత్వం ఒక్క నెల పెన్షన్ ఇచ్చినట్టుయిచ్చి షరతులు పెట్టి పింఛన్లను నిలుపుదల చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రొత్తగా ఇస్తున్నది ఏమిలేదని, మోయిని భస్మాసుర నాటకం ఆడుతుందని హెద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పింఛన్ దారులపట్ల ఎలాంటి షరతులు లేకుండా ఆసరా లబ్ధిదారులందరికీ పింఛన్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 17 రద్దు అయ్యే వరకు వికలాంగులతోపాటు వృద్దులు, వితంతువులు, ఇతర రకాల పింఛన్ దారులను సమీకరించి రాష్ట్ర వ్యాపిత ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఉప్పరి వేణు, కామరాతి వినయ్, చిందాల వెంకటేష్ తదితరులు

Post a Comment

0 Comments